తెలంగాణ భవన్లో ఈరోజు ఒక అరుదైన, ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. ఉన్నత చదువుల కోసం సిద్ధమవుతున్న నలుగురు జెన్ జీ (Gen Z) యువతులు నేరుగా వచ్చి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిశారు. లండన్లోని కింగ్స్ కాలేజీలో చదవనున్న సరయు, నల్సార్ లా యూనివర్సిటీకి చెందిన లాస్య, సింబయాసిస్ లా స్కూల్ విద్యార్థిని రేవతి, సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీకి చెందిన అశ్విని.. తాము భవిష్యత్తులో రాజకీయ నేతలుగా ఎదగాలని నిర్ణయించుకున్నట్లు కేటీఆర్కు వివరించారు. కెరీర్, ఉద్యోగాలే లక్ష్యంగా బతికే ఈ రోజుల్లో సమాజంలో మార్పు కోసం ఈ నలుగురు ఆడబిడ్డలు రాజకీయాల్లోకి రావాలనుకోవడంపై కేటీఆర్ తీవ్ర సంతోషం వ్యక్తం చేశారు.










