Last Updated:
గూగుల్‌లో ఉద్యోగం పొందాలని కలలు కంటున్నారా? అసలు అభ్యర్థులను గూగుల్ ఏ విషయంలో పరీక్షిస్తుందో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.
ప్రపంచంలోని ప్రముఖ టెక్ కంపెనీల్లో పనిచేయాలని లక్షలాది మంది యువత కలలు కంటుంటారు. ఆకర్షణీయమైన జీతభత్యాలు, మంచి పని సంస్కృతి, ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులపై పనిచేసే అవకాశం ఉండటంతో గూగుల్‌లో ఉద్యోగాల కోసం తీవ్ర పోటీ ఉంటుంది. అయితే కేవలం రెజ్యూమ్ పంపితే గూగుల్‌లో ఉద్యోగం దక్కదు. అందుకు సరైన నెట్‌వర్కింగ్, సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు, సంస్థ పని సంస్కృతిని అర్థం చేసుకోవడం కూడా ఎంతో ముఖ్యం.














