Harish Rao : ఆరుగురిని చంపినా పట్టుకోలేరా? | ACTPnews

Harish Rao : ఆరుగురిని చంపినా పట్టుకోలేరా?



షాబాద్ దారుణ ఘటనపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం మరియు పోలీసుల వైఫల్యాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిందితుడు మైనర్ బాలికపై అఘాయిత్యం చేసినప్పుడే పట్టుకోకుండా, అతనికి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేలా పోలీసులు, ప్రభుత్వం సహకరించాయని ఆరోపించారు. ఈరోజు ఆరుగురిని అతి దారుణంగా హత్య చేసినా పోలీసులు నిందితుడిని పట్టుకోలేకపోవడం దారుణమన్నారు. ఆ బాధిత కుటుంబంలో ఇప్పుడు ఒకే ఒక్క అమ్మాయి మిగిలిందని.. మూగ, చెవిటి, నడవలేని స్థితిలో ఉన్న ఆ అమ్మాయి పరిస్థితి తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports