HBD Ilaiyaraaja: టాలీవుడ్‌లో ఇళయరాజా మార్క్ ఇది.. సంగీత దిగ్గజం కెరీర్ మైల్ స్టోన్స్ చూస్తే.. | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

చిత్ర పరిశ్రమలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన సంగీత దర్శకుడు ’ఇళయరాజా’. ఈ రోజు (జూన్ 3) ఈ దిగ్గజం పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన ఆసక్తికర విషయాలు చూద్దాం.

News18
News18

ఇళయరాజా.. ఈ పేరు తెలియని సంగీత ప్రియుడు వుండడు, సినిమా ప్రేమికుడు వుండడు. సినీ సంగీతానికి కొత్త వన్నె తెచ్చి తన విభిన్నమైన సంగీతంతో సినిమా పాటలను కొత్త పుంతలు తొక్కించిన మహా సంగీత జ్ఞాని. చిత్ర పరిశ్రమలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన సంగీత దర్శకుడు ’ఇళయరాజా’. ఈ రోజు (జూన్ 3) ఈ దిగ్గజం పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన ఆసక్తికర విషయాలు చూద్దాం. ఇళయరాజా అసలు పేరు జ్ఞానదేశికన్. 1943, జూన్ 2 లో తమిళ్ నాడు లోని తేని జిల్లాలో పన్నియపురంలో జన్మించారు. రామస్వామి, చిన్నతాయమ్మాల్ దంపతులకు మూడో కుమారుడిగా జన్మించిన ఇళయరాజా.. సినీ సంగీతానికి కొత్త వన్నె తెచ్చి తన విభిన్నమైన సంగీతంతో సినిమా పాటలను కొత్త పుంతలు తొక్కించిన మహా సంగీత జ్ఞాని.

తమిళ చిత్రాలతో కెరీర్ స్టార్ట్ చేసిన ఇళయరాజా, మ్యూజిక్ డైరెక్టర్ గా తొలిచిత్రం తమిళంలో తెరకెక్కిన ‘అన్నక్కలి’. 1970 తర్వాత ఓ ఐదారు సంవత్సరాలు ఒకే తరహా పాటలు వినిపించాయి. ఆ టైమ్‌లోనే ఇళయరాజా అనే ఓ కొత్త సంగీత తరంగం సంగీత ప్రేమికుల వీనులకు తాకింది. తెలుగులో ‘భద్రకాళి’ చిత్రంతో సంగీత దర్శకుడుగా పరిచయమైన ఇళయరాజా మెల్ల మెల్లగా తన విభిన్నమైన వాయిద్యాలతో కొత్త తరహా స్వరాలను సంగీతాభిమానులకు స్లో పాయిజన్‌లా ఎక్కించడం మొదలు పెట్టాడు. తెలుగులో మ్యూజిక్ ఇచ్చిన ఫస్ట్ మూవీ ‘భద్రకాళి. సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో మొదటి సినిమా. ఈ మూవీ తర్వాత తెలుగులో వెనుదిరిగి చూసుకోలేదు.

తమిళ డబ్బింగ్ చిత్రాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన డబ్బింగ్ సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. 1976 లో సంగీత దర్శకుడిగా తమిళ్ లో మొదటిసినిమా ’అన్నకిలి’ చేస్తున్నప్పుడు ఆ చిత్ర నిర్మాత పంచు అరుణాచలం ఆయనని ’ఇళయ’ (అంటే చిన్నవాడు అని తమిళ్‌లో అర్థం) అని పిలిచేవాడు. ఆరోజుల్లో ఏ.యం. రాజా అని మరో సంగీత దర్శకుడు ఉండటంతో ఈ రెండుపదాలని కలిపి ఇళయారాజా అని స్క్రీన్ నేమ్ పెట్టారు. ఇళయరాజాకు జాతీయ అవార్డులు వచ్చిన తెలుగు సినిమాలు సాగర సంగమం, రుద్రవీణ. ఇలా రెండు తెలుగు సినిమాలతో జాతీయ అవార్డులు అందుకున్న అరుదైన ఘనత ఇళయరాజాకు మాత్రమే దక్కింది. మాస్‌ పాటైనా, మెలోడీ సాంగ్‌ అయినా, సంగీత ప్రధానమైన పాటైనా ఇది ఇళయరాజా సాంగ్‌ అని సామాన్య శ్రోత కూడా గుర్తు పట్టేంత విభిన్నంగా అతని పాటలు వుండేవి. శాస్త్రీయ సంగీతానికి వెస్ట్రన్‌ మ్యూజిక్‌ని లింక్‌ చేసి ఎన్నో పాటలు స్వరపరిచి సంగీతం అంటే ఇదీ, పాటలంటే ఇవీ అని అందరిచేతా అనిపించారు. 1980 దశకంలో ఇళయరాజా సంగీతం అంటే చెవి కోసుకునేంతగా పాటలు వినేవారు.

చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన అన్ని సినిమాలనూ మ్యూజికల్‌ హిట్స్‌ చేసిన ఘనత ఇళయరాజాది. అలాగే ఎ.ఆర్‌.రెహమాన్‌ ఇండస్ట్రీకి పరిచయం అవకముందు మణిరత్నం సినిమాలన్నింటికీ ఇళయరాజాయే మ్యూజిక్‌ చేశారు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి సినిమా మ్యూజికల్‌ హిట్‌గా నిలిచింది. తెలుగులో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘గీతాంజలి’ పాటలు ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌. కమల్‌హాసన్‌, కె.విశ్వనాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన సాగర సంగమం, స్వాతిముత్యం చిత్రాలు ఇళయరాజా కెరీర్‌లో మైల్‌స్టోన్స్‌గా చెప్పుకోవచ్చు.

తెలుగు అగ్ర హీరోల సినిమాలకు మరిచిపోని సంగీతాన్ని అందించారు ఇళయరాజా. అంతేకాదు ఆయా హీరోలకు మరుపురాని ఎన్నో మెమరబుల్ హిట్స్ అందించిన ఘనత కూడా ఇళయ రాజాకే దక్కుతుంది. 2010 లో ‘పద్మభూషణ్’ పురస్కారం.. 2018లో కేంద్రం నుంచి పద్మవిభూషణ్ పురస్కారం.. పలు జాతీయ అవార్డులను అందుకున్న ఆయన.. 40 సంవత్సరాల వృత్తి జీవితంలో వివిధ భాషలలో దాదాపు 5,000 పాటలకు, 1000 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports