Heavy Rain Alert: ఏపీ, తెలంగాణలో 24 వరకు భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో ప్రజలు అలర్ట్‌గా ఉండమని వార్నింగ్ | తెలంగాణ వార్తలు | ACTPnews

Heavy Rain Alert


Last Updated:

Heavy Rain Alert: వాన జాడ లేకపోవడంతో చినుకుల కోసం ఆకాశం వైపు చూస్తున్న ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) చల్లటి కబురు అందించింది. రాష్ట్రంలో శనివారం నుంచి అంటే సెప్టెంబర్ 19 నుంచి 24వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Heavy Rain Alert
Heavy Rain Alert

Heavy Rain Alert: వాన జాడ లేకపోవడంతో చినుకుల కోసం ఆకాశం వైపు చూస్తున్న ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) చల్లటి కబురు అందించింది. రాష్ట్రంలో శనివారం నుంచి అంటే సెప్టెంబర్ 19 నుంచి 24వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

బంగాళాఖాతంలో సెప్టెంబర్ 19 సాయంత్రం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్ కేంద్రం తెలిపింది. ఇది క్రమంగా బలపడి దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్ర తీరాల వైపు కదులుతుందని, దీని ప్రభావంతో తెలంగాణలో వర్షాలు పుంజుకుంటాయని అంచనా వేసింది.

ఈ వానాకాలంలో ఇప్పటివరకు రాష్ట్రంలో సాధారణం కన్నా 19 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఈ కొత్త అల్పపీడనంతో ఆ లోటు కొంతవరకు భర్తీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు, రేపు(శని, ఆదివారాల్లో).. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, మెదక్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

తర్వాతి రోజుల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్‌ సహా మరిన్ని జిల్లాలకు ఈ హెచ్చరికలు వర్తించనున్నాయి. హైదరాబాద్ నగరంలోనూ సాయంత్రం లేదా రాత్రి వేళల్లో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. రుతుపవనాల తిరోగమనం ఆలస్యమయ్యే సూచనలు ఉన్నాయని, అక్టోబర్ రెండో వారం వరకు వర్షాలు కొనసాగవచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఉపరితల ఆవర్తన ప్రభావంతో శనివారం సాయంత్రానికి ఉత్తర అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని #APSDMA MD ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది క్రమంగా బలపడి, ఆతదుపరి మూడునాలుగు రోజులలో పశ్చిమవాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర తీరాల వైపు పయనించే అవకాశం ఉందని వెల్లడించారు.

 విశాఖ, తిరుపతి, కడప, నంద్యాల ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం కురుస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రజలు చెట్లు, హోర్డింగ్స్ కింద నిలబడవద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.ఇక ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. దర్శి, అద్దంకి, వినుకొండ, కురిచేడు పరిసర ప్రాంతాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షం కురుస్తుందని తెలిపింది.

మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. అల్లూరి, అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణకేంద్రం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లోని తుని, తొండంగి, పాయకరావుపేట, కొత్తవలస మండలాల్లో భారీ వర్షం కురిసే ఛాన్సుందని తెలిపింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed