Hyderabad: మహిళను కొట్టి, జుట్టు పట్టుకొని రోడ్డుపై ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. పోలీస్ ఓవర్ యాక్షన్ వీడియో వైరల్ | ట్రెండింగ్ | ACTPnews

Hyderabad Railway Police


Last Updated:

Hyderabad: ఒంటిపై ఖాకీ యూనిఫామ్ చూసుకొని తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ధీమాతో అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. హైదరాబాద్‌లో ఓ మహిళను రైల్వే పోలీస్ కానిస్టేబుల్ కొట్టాడు. అంతే కాదు జుట్టు పట్టుకొని రోడ్డుపైనే ఈడ్చుకెళ్లడం చూసి జనం తమ సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Hyderabad Railway Police
Hyderabad Railway Police

Hyderabad: సమాజంలో శాంతి, భద్రతలను పర్యవేక్షిస్తూ పౌరులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న కొందరు పోలీసుల, ట్రాఫిక్, రైల్వే పోలీసులు అమాయకులు, ఆడవాళ్లు, రోడ్లపై తిరిగే వాళ్లపై తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఒంటిపై ఖాకీ యూనిఫామ్ చూసుకొని తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ధీమాతో అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. హైదరాబాద్‌లోని హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్‌లో పరిసరాల్లో ఓ షాపు ముందు నిల్చున్న మహిళను రైల్వే పోలీస్ కానిస్టేబుల్ కొట్టాడు. అంతే కాదు ఆమె మాటలు వినిపించుకోకుండా జుట్టు పట్టుకొని రోడ్డుపైనే ఈడ్చుకెళ్లడం చూసి జనం తమ సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈవీడియోని చూపిస్తూ నెటిజన్లు ఏది ఆడవాళ్లకు రక్షణ అంటూ ప్రశ్నిస్తున్నారు. హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ వద్ద మహిళపై దాడి ఘటనలో హోమ్ గార్డ్ ఆనంద్‌పై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

నడిరోడ్డుపై కానిస్టేబుల్ క్రూరత్వం..

ప్రజలకు భద్రత, రక్షణ కల్పించాల్సిన పోలీసులే వారి పాలిట భక్షకులుగా మారుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డ్యూటీలో ఉండి ఒంటిపై ఖాకీ యూనిఫామ్ వేసుకున్న ఓ రైల్వే పోలీస్ కానిస్టేబుల్ హైదరాబాద్‌లోని హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్‌ పరిధిలో ఓ మహిళను కొట్టి.. జుట్టు పట్టి ఈడ్చుకెళ్లాడు. శుక్రవారం రాత్రి జరిగిన ఈఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చీకటిగా ఉండటంతో పోలీస్ పేరు, అతని ఐడీ నంబర్ సరిగా కనిపించలేదు.

మహిళ జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ..

ఓ దుకాణం దగ్గర అచేతనంగా నిలబడి ఉన్న మహిళను కానిస్టేబుల్ ఏదో విషయంలో ప్రశ్నించాడు. దానికి ఆమె బదులు ఇవ్వకపోవడంతో ఆమెపై ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. విచక్షణారహితంగా కొట్టడమే కాకుండా అక్కడి నుంచి జుట్టు పట్టుకొని స్టేషన్ వైపుకి ఆమెను లాక్కెళ్లాడు రైల్వే పోలీస్ కానిస్టేబుల్. విచిత్రం ఏమిటంటే ఈఘటన జరుగుతున్న సమయంలో పక్కనే ఆమె భర్త కూడా ఉన్నాడు. తన భార్యను వదిలేయమని భర్త కానిస్టేబుల్‌ని వేడుకున్నప్పటికి వినిపించుకోలేదు.

ఎందుకంత కండకావరం..

ఖాకీ యూనిఫామ్‌లో ఉన్న రైల్వే పోలీస్ కానిస్టేబుల్ కనికరం లేకుండా ఆమెపై పైశాచికత్వం ప్రదర్శించాడు. రైల్వే పోలీస్ కానిస్టేబుల్ తీరుపై తారాస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతున్న ఈ వీడియోని చూపిస్తూ నెటిజన్లు పోలీస్ కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోరా అని ప్రశ్నిస్తున్నారు. నేరం, తప్పు చేసిన వాళ్లను కాపాడే పోలీసులు.. ఇలా అమాయకులపైనే తమ ప్రతాపం చూపిస్తారంటూ విస్తృతంగా కామెంట్స్ పెడుతున్నారు.హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ వద్ద మహిళపై దాడి ఘటనలో హోమ్ గార్డ్ ఆనంద్‌పై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed