Last Updated:
Hyderabad: హైదరాబాద్ నగరంలోని బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్ నుంచి అత్యాధునిక ఆయుధాలు, మందుగుండు సామగ్రి మాయమైన సంచలన ఘటనలో మిస్టరీ ఎట్టకేలకు వీడింది.
అత్యంత భద్రత నడుమ ఉండే రక్షణ స్థావరం నుంచి ఆయుధాలు చోరీకి గురికావడం తీవ్ర కలకలం రేపగా, రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు దర్యాప్తును వేగవంతం చేసి నిందితుడిని గుర్తించాయి. గతంలో మద్రాసు రెజిమెంట్‌లో సేవలందించిన ఓ మాజీ మిలటరీ అధికారే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అధికారులు నిర్ధారించారు. మిలటరీ స్థావరం భద్రతా వ్యవస్థలు, అక్కడి పరిస్థితులపై ఉన్న పూర్తి అవగాహనతోనే నిందితుడు ఈ చోరీకి పథకరచన చేసినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది.














