Hyderabad: మద్రాస్ రెజిమెంట్‌లో భారీగా ఆయుధాలు చోరీ.. AK 47 గన్స్‌తో పాటు వెపన్స్ మాయం | తెలంగాణ వార్తలు | ACTPnews

hyderabad


Last Updated:

Army Weapons Theft: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్ పరిధిలోని మద్రాస్ రెజిమెంట్‌లో భారీగా ఆయుధాలు చోరీకి గురయ్యాయి. దొంగలు అత్యంత కట్టుదిట్టంగా ఈ దోపిడీకి పాల్పడ్డారు. రెజిమెంట్‌లోని 12 అత్యాధునికమైన ఆయుధాలు అపహరించినట్లుగా ఆర్మీ అధికారులు బొల్లారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

hyderabad
hyderabad

Army Weapons Theft: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్ పరిధిలోని మద్రాస్ రెజిమెంట్‌లో భారీగా ఆయుధాలు చోరీకి గురయ్యాయి. దొంగలు అత్యంత కట్టుదిట్టంగా ఈ దోపిడీకి పాల్పడ్డారు. రెజిమెంట్‌లోని 12 అత్యాధునికమైన ఆయుధాలు అపహరించినట్లుగా ఆర్మీ అధికారులు బొల్లారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గది తాళాన్ని పగలగొట్టిన దుండగులు 12 ఆయుధాలను ఎత్తుకెళ్లినట్లుగా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఆర్మీ ఆయుధాలు భద్రపరిచే గదిలో మాయమైన వెపన్స్‌లో నాలుగు ఏకే 47, ఆరు పిస్టల్స్ ఉన్నట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక ఇన్సాస్ రైఫిల్‌తో పాటు పెద్ద మొత్తంలో మందుగుండును ఎత్తుకెళ్లినట్లుగా గుర్తించారు ఆర్మీ అధికారులు. ఆర్మీ అధికారుల ఫిర్యాదుతో బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసుకొని రహస్యంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆర్మీ ఆయుధాలు భద్రపరిచే గదిలో వెపన్స్ మాయమైనట్లుగా బయటపడకుండా అధికారులు గుట్టుగా ఉంచినప్పటికి విషయం బయటపడింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *