Hyderabad: సుపారీ గ్యాంగ్‌తో భార్య హత్య.. నేరస్తుడిని పట్టించిన కూరగాయల సంచి! | తెలంగాణ వార్తలు | ACTPnews

ప్రతీకాత్మక చిత్రం


Last Updated:

ఆపై ఏమీ తెలియనట్లు పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసి నాటకమాడాడు. అయితే, ఘటనా స్థలంలో దొరికిన ఒక చిన్న ఆధారంతో పోలీసులు నిందితుడి గుట్టు రట్టు చేశారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Hyderabad: కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య వచ్చిన విభేదాలు చివరకు ఒక మహిళ దారుణ హత్యకు దారితీశాయి. తనతో కలిసి జీవిస్తున్న భార్యను ఎలాగైనా వదిలించుకోవాలని భావించిన ఒక కిరాతక భర్త, ఏకంగా సుపారీ గ్యాంగ్‌ను రంగంలోకి దించి ఆమెను హతమార్చాడు. ఆపై ఏమీ తెలియనట్లు పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసి నాటకమాడాడు. అయితే, ఘటనా స్థలంలో దొరికిన ఒక చిన్న ఆధారంతో పోలీసులు నిందితుడి గుట్టు రట్టు చేశారు. సంగారెడ్డి జిల్లా బీడీఎల్ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంచలన హత్య కేసు వివరాలు ఇలా ఉన్నాయి.

అసలేం జరిగిందంటే?

బిహార్ రాష్ట్రానికి చెందిన అనిల్‌కుమార్, మీనాదేవి (25) దంపతులు ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సంగారెడ్డి జిల్లా, బీడీఎల్ బొల్లారంలో గల వెంకటేశ్వర కాలనీలో వీరు నివాసముంటున్నారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అనిల్ ఇక్కడొక ఇనుము తయారీ కంపెనీలో లేబర్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తూ, సొంతంగా వాహనాలను కూడా అద్దెకు ఇస్తుంటాడు. అయితే, కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తీవ్రమైన మనస్పర్థలు, విభేదాలు నడుస్తున్నాయి. నిత్యం జరుగుతున్న గొడవలతో విసిగిపోయిన అనిల్, భార్య మీనాదేవిని పూర్తిగా వదిలించుకోవాలని ఒక కిరాతక ప్లాన్ వేశాడు.

బిహార్ గ్యాంగ్‌కు సుపారీ

భార్యను చంపేందుకు అనిల్ తన సొంత రాష్ట్రమైన బిహార్‌కు చెందిన నలుగురు వ్యక్తులతో కూడిన ఒక సుపారీ గ్యాంగ్‌ను సంప్రదించాడు. వారికి పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపి హైదరాబాద్‌కు పిలిపించాడు. పథకం ప్రకారం.. మే 30న సాయంత్రం అనిల్ తన భార్య మీనాదేవిని తీసుకుని బీడీఎల్ బొల్లారం పరిధిలోని స్థానిక వారపు సంతకు వెళ్లాడు. అక్కడ కూరగాయలు కొనుగోలు చేసిన తర్వాత ఇద్దరూ కలిసి బైక్‌పై ఇంటికి తిరుగుపయనమయ్యారు.

ముందుగా అనుకున్నట్లుగానే, ఒక నిర్జన ప్రదేశానికి రాగానే అనిల్ తన వాహనాన్ని ఆపేశాడు. బైక్ రిపేర్ వచ్చినట్లు అతడు నటిస్తుండగా, పొదల్లో నక్కి ఉన్న సుపారీ గ్యాంగ్ సభ్యులు ముగ్గురు ఒక్కసారిగా మీనాదేవిపై దాడి చేశారు. ఆమెను బలవంతంగా పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెళ్లి, కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు.

గొంతు కోశారంటూ సినిమా కట్టుకథ!

హత్య అనంతరం అనిల్ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బోరున విలపించాడు. తాము సంత నుండి వస్తుండగా గుర్తుతెలియని ముగ్గురు దుండగులు తమను అడ్డగించారని, తనపై దాడి చేసి, తన భార్యను పొదల్లోకి లాక్కెళ్లి గొంతు కోసి చంపేశారని ఫిర్యాదు చేశాడు. దుండగులతో పోరాడే క్రమంలో తనకు కూడా గాయాలయ్యాయంటూ తన చేతులు, వీపుపై ఉన్న కత్తి గాట్లను పోలీసులకు చూపించాడు.

పట్టిచ్చిన కూరగాయల సంచి, కృత్రిమ గాయాలు

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే అనిల్ చెప్పిన కథకు, అక్కడ ఉన్న పరిస్థితులకు ఎక్కడా పొంతన కుదరలేదు.

మొదటి అనుమానం: బైక్ ఆగినప్పుడు కూరగాయల సంచి తన భార్య చేతిలోనే ఉందని అనిల్ చెప్పాడు. ఒకవేళ దుండగులు ఆమెను అంత బలంగా లాక్కెళ్లినప్పుడు కూరగాయలు కిందపడి చెల్లాచెదురు కావాలి. కానీ అక్కడ కూరగాయల సంచి ఎంతో పద్ధతిగా ఉంది.

రెండవ అనుమానం: అనిల్ ఒంటిపై ఉన్న కత్తి గాట్లను నిశితంగా పరిశీలించిన పోలీసులకు అవి ఎవరో దాడి చేసినట్లు కాకుండా, సినిమా తరహాలో బ్లేడ్‌తో కావాలని గీసుకున్న కృత్రిమ గాయాలుగా తేలింది.

ఈ రెండు అనుమానాలతో పోలీసులు అనిల్‌ను తమదైన శైలిలో విచారించగా అసలు నిజం ఒప్పుకున్నాడు. భార్యతో ఉన్న విభేదాల వల్లే సుపారీ ఇచ్చి చంపించినట్లు అంగీకరించాడు. ఈ కేసులో భర్త అనిల్‌తో పాటు సుపారీ గ్యాంగ్‌కు చెందిన ఒక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగిలిన ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘోర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed