Last Updated:
Hyderabad: ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి గ్రేటర్ హైదరాబాద్‌కు గుట్టుచప్పుడు కాకుండా మత్తు పదార్థాలను తరలిస్తున్న ముఠా గుట్టును తెలంగాణ పోలీసులు రట్టు చేశారు.
పోలీసుల కళ్లుగప్పేందుకు ఏకంగా వంద కిలోమీటర్లకో లారీని మారుస్తూ, సినీఫక్కీలో హ్యాష్ ఆయిల్‌ను గమ్యస్థానానికి చేర్చేందుకు యత్నించిన ముగ్గురు నిందితులను మల్కాజిగిరి స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి మార్కెట్లో సుమారు రూ. 1.5 కోట్ల విలువచేసే 12 కిలోల స్వచ్ఛమైన హ్యాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి ఈ కేసుకు సంబంధించిన సమగ్ర వివరాలను మీడియాకు వెల్లడించారు.














