Last Updated:
Hyderabad: ఆస్తులు, డబ్బు సంపాదిస్తే వాటి కోసం తల్లిదండ్రుల్ని వేధించడం, వృద్దాప్య సమస్యలతో బాధపడే కన్నవాళ్లను మరింత క్షోభకు గురి చేస్తూ వృద్ధాశ్రమాల్లో వదిలిపెడుతున్న వార్తలు నిత్యం ఏదో ఓ చోట చూస్తూనే ఉన్నాం. తాజాగా హైదరాబాద్ మియాపూర్లోని ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీలో తల్లిదండ్రుల్ని ఇంట్లోంగి గెంటేసి ఇల్లు అమ్ముకుందామని కొడుకు, కోడలు ప్రయత్నించారు.
Hyderabad: చంకలో ఉన్నప్పుడే బిడ్డలు.. మీసాలు, గడ్డాలు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల్ని ఇంట్లోంచి గెంటేసేది కూడా అదే కొడుకులు. సమాజంలో స్వార్ధమో లేక మూర్ఖత్వమో తెలియదు కాని చాలా మంది తమకు జన్మనిచ్చిన వాళ్లను చివరి రోజుల్లో కంటికి రెప్పలా చూసుకోవాల్సింది పోయి.. దూరం చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆస్తులు, డబ్బు సంపాదిస్తే వాటి కోసం తల్లిదండ్రుల్ని వేధించడం, వృద్దాప్య సమస్యలతో బాధపడే కన్నవాళ్లను మరింత క్షోభకు గురి చేస్తూ వృద్ధాశ్రమాల్లో వదిలిపెడుతున్న వార్తలు నిత్యం ఏదో ఓ చోట చూస్తూనే ఉన్నాం. తాజాగా హైదరాబాద్ మియాపూర్లోని ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీలో తల్లిదండ్రుల్ని ఇంట్లోంగి గెంటేసి ఇల్లు అమ్ముకుందామని కొడుకు, కోడలు ప్రయత్నించారు. జీవితాంతం కష్టపడి పిల్లలే సర్వస్వం అనుకున్న ఆ తల్లిదండ్రులు తమ కొడుకు, కోడలు చేసిన ఘనకార్యాన్ని నలుగురికి తెలిసేలా చేశారు.
ఆస్తులు అనుభవించడానికి.. ఆత్మీయులు అనురాగాన్ని పంచుకోవడానికి అనే నగ్న సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు జనం. నవమాసాలు మోసి కని, పెంచి, ప్రయోజకుల్ని చేసి వాళ్ల చేతుల్లోనే కన్నుమూయాలనుకునే తల్లిదండ్రులకు కొందరు కొడుకులు పెళ్లి చేసుకున్న తర్వాత భార్యతో కలిసి కన్నవాళ్లను కష్టాల పాలు చేస్తున్నారు. మియాపూర్లోని ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీలో నివాసముంటున్న దేవులపల్లి లక్ష్మణ్, జయలక్ష్మి దంపతులకు రవికుమార్ అనే కొడుకు ప్రసూన అనే కోడలు ఉన్నారు. వీరితో కలిసి జీవిస్తున్న లక్ష్మణ్, జయలక్ష్మి దంపతులకు కొడుకు, కోడలు ఊహించని షాక్ ఇచ్చారు. ఇంట్లోంచి బయటకు గెంటేసి.. ఇల్లు అమ్ముకునేందుకు ప్రయత్నించాడు రవికుమార్.
వృద్దాప్యంలో కన్నకొడుకు సరిగా చూడక.. ఉంటున్న ఇంటిని కూడా అమ్మేస్తే తాము ఏం కావాలి..? ఎక్కడికి వెళ్లాలి..? తమను ఎవరు చూస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లక్ష్మణ్, జయలక్ష్మి దంపతులు. తమకు న్యాయం చేయాలంటూ.. ఇంటి గేటుకు ఫ్లెక్సీ తగిలింది గేటు ముందు కూర్చొని నిరసన చేస్తున్నారు. ఈ విషయం మీడియాలో రావడంతో బాధిత వృద్దదంపతులు తమ కొడుకు, కోడలి నిజస్వరూపాన్ని బయటపెట్టారు.
తమ కొడుకు రవికుమార్, కోడలు ప్రసూన తమని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను చూసుకోకపోగా.. ఇంట్లోంచి బయటకు గెంటేసి తాము నివసిస్తున్న ఇల్లుని అమ్మేందుకు చూస్తున్నాడంటూ ధర్నా చేపట్టారు. ఫ్లెక్సీ చేత పట్టి.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు దేవులపల్లి లక్ష్మణ్, జయలక్ష్మి దంపతులు.














