Viral Video: గుండె నోట్లోకి రావడం అంటే ఇదే.. ఊడిపోయిన విమానం టైర్.. ఎమర్జెన్సీ ల్యాండింగ్.. తర్వాత ఏం జరిగిందంటే? | | ACTPnews

PC: X.com


Last Updated:

Viral Video: ఇరాన్‌కు చెందిన సెపెహ్రాన్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737 విమానానికి గాల్లో పెను ప్రమాదం తప్పింది.

PC: X.com
PC: X.com

టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం చక్రం టైర్ ఊడిపోవడంతో ఇంజిన్‌లో సమస్య తలెత్తింది. ఫలితంగా గాల్లో విమానం తీవ్రంగా కంపించడంతో పైలట్ అత్యవసరంగా విమానాన్ని మష్హద్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈశాన్య ఇరాన్‌లోని మష్హద్ నగరం నుంచి కెర్మాన్‌షాకు బయలుదేరిన కొద్దిక్షణాల్లోనే సిబ్బంది ఈ సమస్యను గుర్తించారు. విమానం చక్రం ఊడిపోయిన అనంతరం సాంకేతిక సమస్య తలెత్తినట్లు పైలట్ ప్రయాణికులకు వెల్లడించారు. అయితే ప్రయాణం కొనసాగుతున్న కొద్దీ విమానం తీవ్రంగా ఊగిపోవడం మొదలుకావడంతో, ప్రయాణాన్ని రద్దు చేసుకుని వెనక్కి తిరిగి మష్హద్‌కే మళ్లించాల్సి వచ్చింది.

విమానం తీవ్ర కుదుపులకు గురికావడంతో లోపల ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. కుదుపుల దాటికి క్యాబిన్‌ పైభాగంలోని లగేజీ కంపార్ట్‌మెంట్లు (ఓవర్‌హెడ్ బిన్స్) తెరుచుకుని ప్రయాణికుల సామాన్లు సీట్లు, నడిచే దారిపై పడిపోయాయి. పైకప్పు భాగాలు విరిగిపడటంతో కొందరు ప్రయాణికులకు వస్తువులు తగిలాయి. విమానం వెనక్కి వస్తున్న సమయంలో భయంతో ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ దేవుడిని ప్రార్థిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

అత్యవసర సేవా సిబ్బంది సిద్ధంగా ఉండగా, పైలట్ బోయింగ్ 737 విమానాన్ని మష్హద్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికులకు గానీ, సిబ్బందికి గానీ ఎలాంటి గాయాలు కాలేదని ప్రాథమిక నివేదికలు స్పష్టం చేశాయి. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. టైర్ ఊడిపోవడం వల్లే ఇంజిన్ దెబ్బతిందా అనే అంశంపై ఏవియేషన్ అధికారులు దర్యాప్తు చేపట్టనున్నారు. ఇటీవల కాలంలో మష్హద్ ఎయిర్‌పోర్టులో సెపెహ్రాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ఇలాంటి ఎమర్జెన్సీ రావడం ఇది రెండోసారి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports