Hyderabad: ప్రియుడి మోజులో మూడేళ్ల కుమారుడిని హతమార్చిన.. కీసరలో దారుణం | తెలంగాణ వార్తలు | ACTPnews

ప్రతీకాత్మక చిత్రం


Last Updated:

భువనగిరి జిల్లాకు చెందిన జ్యోతితో వివాహం కాగా, వారికి ఒక కుమార్తె, కుమారుడు హరికృష్ణ (3) ఉన్నారు. అయితే, జ్యోతికి తన సొంత గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త ఇంట్లో లేని సమయంలో నవీన్ తరచూ జ్యోతిని కలవడానికి వచ్చేవాడు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Hyderabad: పసివాడి ఏడుపు ఆ కన్నతల్లికి కోపాన్ని తెప్పించింది.. ప్రియుడి మోజులో పడి కన్నప్రేమను మరిచిపోయింది. పదేపదే ఏడుస్తున్నాడనే నెపంతో మూడేళ్ల సొంత కుమారుడిని ప్రియుడితో కలిసి కొట్టి చంపిన అమానుష ఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. కట్టుకథలతో భర్తను నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేసినప్పటికీ, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఈ దారుణ హత్య ఉదంతం ఆలస్యంగా బయటపడింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం

సిద్దిపేట జిల్లా తీగుల్ గ్రామానికి చెందిన ఆర్.స్వామి, మూడేళ్ల క్రితం కీసర మండలం చీర్యాలకు వలసవచ్చి క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి యాదాద్రి-భువనగిరి జిల్లాకు చెందిన జ్యోతితో వివాహం కాగా, వారికి ఒక కుమార్తె, కుమారుడు హరికృష్ణ (3) ఉన్నారు. అయితే, జ్యోతికి తన సొంత గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త ఇంట్లో లేని సమయంలో నవీన్ తరచూ జ్యోతిని కలవడానికి వచ్చేవాడు.

చిన్నారి ఏడ్చాడని ఘాతుకం

ఈ నెల 28న భర్త ఇంట్లో లేని సమయంలో జ్యోతి, ప్రియుడు నవీన్‌ను ఇంటికి పిలిపించుకుంది. ఆ సమయంలో కుమార్తె బయటకు వెళ్లగా, మూడేళ్ల హరికృష్ణ ఇంట్లోనే ఉన్నాడు. ఇద్దరూ కలిసి ఉన్న సమయంలో బాలుడు పదేపదే ఏడవడం ప్రారంభించాడు. దీంతో తీవ్ర కోపోద్రిక్తులైన జ్యోతి, నవీన్ కలిసి చిన్నారిని విచక్షణారహితంగా కొట్టడంతో బాలుడు స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే బైక్‌పై ఆస్పత్రికి తరలించినప్పటికీ, అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

మూర్ఛ రోగమంటూ కట్టుకథ.. అంత్యక్రియలు

ఆస్పత్రి నుంచి మృతదేహంతో ఇంటికి వచ్చిన జ్యోతి, సాయంత్రం భర్త స్వామి ఇంటికి రాగానే కట్టుకథ అల్లింది. బాబుకు మూర్ఛ వ్యాధి రావడంతో మంచంపై నుంచి కిందపడి చనిపోయాడని నమ్మించింది. భార్య మాటలను నిజమేనని నమ్మిన స్వామి, కుమారుడి మృతదేహాన్ని సొంతూరికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశాడు.

రక్తపు మరకలు, సీసీ కెమెరాలతో బయటపడ్డ నిజం

కొన్ని రోజుల తర్వాత స్వామి చీర్యాలలోని తన ఇంటికి రాగా, ఇంట్లో రక్తపు మరకలు కనిపించడంతో అనుమానం వచ్చింది. వెంటనే కాలనీలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా, కుమారుడు చనిపోయిన రోజున ప్రియుడు నవీన్ తమ ఇంటికి వచ్చి వెళ్లిన దృశ్యాలు కనిపించాయి. భార్యే ప్రియుడితో కలిసి కుమారుడిని హత్య చేసిందని గ్రహించిన స్వామి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

నిందితుల అరెస్ట్

బాధితుడి ఫిర్యాదు మేరకు కీసర సీఐ అంజనేయులు, ఎస్ఐ శ్రీనివాసరెడ్డి కేసు నమోదు చేసి జ్యోతిని విచారించగా, భర్త లేని సమయంలో ప్రియుడితో కలిసి కుమారుడిని చంపినట్లు అంగీకరించింది. పోలీసులు నిందితులిద్దరినీ శనివారం అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports