Last Updated:
IND vs BAN: మహిళల టీ20 ఆసియాకప్ టోర్నీలో భారత జట్టు తమ ఆధిపత్యాన్ని చాటుతూ సగర్వంగా ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం దుబాయ్ వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్ పోరులో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది.
ఓపెనర్ షఫాలి వర్మ మెరుపు ఇన్నింగ్స్‌కు తోడుగా, భారత స్పిన్నర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేయడంతో భారత్‌కు ఈ అలవోక విజయం దక్కింది. దీంతో ఆసియాకప్ టైటిల్‌ను నిలబెట్టుకోవడానికి భారత్ కేవలం అడుగు దూరంలో నిలిచింది.














