Last Updated:
Independence Day 2026: ఢిల్లీ – ఎన్సీఆర్ ప్రాంతంలోని సుమారు 100 మంది పీఎం విశ్వకర్మ లబ్ధిదారులకు ఈ అరుదైన అవకాశం దక్కింది. వీరు తమ జీవిత భాగస్వాములు లేదా సహచరులతో కలిసి ఈ ప్రతిష్టాత్మక వేడుకల్లో పాల్గొంటారు.
భారతదేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవాలకు ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట ముస్తాబవుతోంది. ఆగస్టు 15న జరగనున్న ఈ జాతీయ పండుగను మరింత విశేషంగా జరుపుకునేందుకు భారత ప్రభుత్వం ఒక వినూత్నమైన, స్ఫూర్తిదాయకమైన నిర్ణయం తీసుకుంది. దేశ సంస్కృతి, సాంప్రదాయాలను తమ అద్భుతమైన వృత్తి నైపుణ్యాలతో బతికిస్తున్న ‘పీఎం విశ్వకర్మ’ పథకం లబ్ధిదారులను ఈ వేడుకలకు ‘ప్రత్యేక అతిథులు’గా కేంద్రం సగౌరవంగా ఆహ్వానించిందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలిపింది.














