హైదరాబాద్ నుంచి గయ, వారణాసి, ప్రయాగ్రాజ్, అయోధ్య, లక్నో వంటి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించేలా ఐఆర్సీటీసీ టూరిజం కొత్త యాత్ర ప్యాకేజీని ప్రకటించింది. ఎనిమిది రోజుల పాటు జరిగే ఈ ప్యాకేజీలో విమాన ప్రయాణం, వసతి, భోజనం, సందర్శన సౌకర్యాలు, ఐఆర్సీటీసీ టూర్ ఎస్కార్ట్ సేవలు ఉంటాయి. ఆధ్యాత్మిక ప్రదేశాలను సౌకర్యంగా సందర్శించాలనుకునే వారికి ఈ ప్యాకేజీ ఉపయోగపడనుంది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) టూరిజం “గంగా గయా సంగం యాత్ర” పేరుతో ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని ముఖ్యమైన ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాంతాలను కవర్ చేసేలా ఈ యాత్రను రూపొందించారు. ఇందులో గయా, వారణాసి, ప్రయాగ్రాజ్, అయోధ్య, లక్నో, నైమిశారణ్యం సందర్శనలు ఉంటాయి. 07 రాత్రులు, 08 రోజుల ఈ ప్యాకేజీ 2026 సెప్టెంబర్ 2న ప్రారంభం కానుంది. ప్రయాణం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మొదలవుతుంది. ఉత్తర భారతదేశంలోని పురాతన దేవాలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, సాంస్కృతిక ప్రదేశాలను సందర్శించే అవకాశం ప్రయాణికులకు లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)














