తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న సాగునీటి ఎద్దడి, రైతాంగ ఇబ్బందులపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యుత్, సాగునీరు, సంక్షేమ పథకాల గురించి ఏది అడిగినా ఎల్నినో ప్రభావం అని చెబుతూ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణకు పట్టింది ఎల్నినో దయ్యం కాదని, ముమ్మాటికీ కాంగ్రెస్ దయ్యమేనని ధ్వజమెత్తారు. కృష్ణ, గోదావరి నదుల్లో నీళ్లు పుష్కలంగా ఉన్నప్పటికీ, పథకం ప్రకారమే పంటలు పండకుండా చేసి, నీళ్లను ఏపీకి మళ్లిస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
#JagadishReddy #BRSVsCongress #RevanthReddy #TelanganaIrrigation #TelanganaPolitics2026













