జులై 16న వైట్ హౌస్ ప్రెస్ బ్రీఫింగ్లో లీవిట్.. ఇరాన్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఇరాన్ స్థావరాలపై అమెరికా వరుస పెట్టి దాడులు చేస్తున్నా.. ఇరాన్ మాత్రం.. తమతో డీల్ కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. “అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన 14 పాయింట్ల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ కాలరాసింది. అందుకే ఇరాన్ స్థావరాలపై అమెరికా వారం నుంచి దాడులు చేస్తోంది. వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఇది ఒప్పందాన్ని ఉల్లంఘించడమే. అందుకే అమెరికా, ఇరాన్‌పై దాడులు చేస్తోంది” అని అమె చెప్పారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ద్వారా ఇరాన్ సైన్యం, ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లిందనీ, ఇరాన్ ఇప్పటికీ డీల్ కోసం మాట్లాడుతోందని అన్నారు. ఇరాన్ అణు కార్యక్రమం పట్ల ట్రంప్ జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్నారనే విషయాన్ని ఆమె బలపరిచారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ మీడియాలో వైరల్ అయ్యాయి. (Image credit – instagram – karolineleavitt)














