ఇంతలో శౌర్య వచ్చి.. మా అమ్మ సీఈవో అని మా ఫ్రెండ్స్ అందరికీ చెబుతాను అంటుంది. జ్యోత్స్న రెస్టారెంట్లో సీఈవోలంతా మన ఇంటి నుంచే అవుతున్నారు. ముందు నువ్వు, తర్వాత మీ నాన్న.. ఇప్పుడు నీ భార్య అయ్యారని చెబుతుంది కాంచన. తర్వాత నేను కూడా సీఈవో అవుతానని అంటుంది శౌర్య. జ్యోత్స్న తప్పు చేసింది కదా మరి మా వదిన ఏం అనలేదా? అని కాంచన ప్రశ్నిస్తుంది. అత్తకి చెప్పొద్దని పారు తాత కాళ్లు పట్టుకుంది, అందుకే ఈ విషయాలు మా అత్తకి తెలియవు అంటాడు కార్తీక్. తెలిస్తే మా వదిన ఊరుకోదు, తెలియకుండా ఎన్నాళ్లు దాస్తారు.. మీ ప్రవర్తన చూసైనా అనుమానం వస్తుంది. అప్పుడు మా అన్నయ్యని, మా నాన్నని అడుగుతుంది. మరోవైపు.. రాత్రి శివన్నారాయణ, దశరథలతో సుమిత్ర మాట్లాడుతుంది. నా కూతురు ఏదైనా తప్పు చేసిందా అని ప్రశ్నిస్తుంది. (Photo Credit: Karthika Deepam Serial Star maa/ Jio + Hotstar)













