Last Updated:
KCR Erravelli Farmhouse Land Row: కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ పంచాయితీకి అసలు కారణం ఆమెనంట. పసుపు నీళ్లు చల్లినందుకు ఇప్పుడు ఏకంగా కేసీఆర్ 400 ఎకరాల భూమి పోయే పరిస్థితి తలెత్తింది. ఇంతకీ ఎవరా పావనీ గౌడ్..?
KCR Erravelli Farmhouse Land Row: తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య భూప్రకంపనలు తారాస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉంటున్న ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కి చెందిన 388 ఎకరాల భూమిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు, నిజంగా ఆ భూములు కేసీఆర్ ఎలా పొందారనే దానిపై పూర్తి వివరణ, విచారణ జరిపించాలని అసెంబ్లీ సాక్షిగా రెవిన్యూశాఖ మంత్రితో పాటు సదరు ఉన్నతాధికారులను జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. నిజంగా కేసీఆర్ ఫామ్ హౌస్ పేరుతో ఉన్న వందల ఎకరాల భూమి నిజంగా ఆయన పూర్వికుల నుంచి సంక్రమించింది కాకపోయినా.. కేసీఆర్ చట్టబద్దంగా కొనుగోలు చేయకపోయినా వాటిని స్వాధీనం చేసుకొని దళితులకు అంటే ఎర్రవల్లిలోని 800 వందల కుటుంబాలకు ఒక్కో ఫ్యామిలీకి అర ఎకరం ఇస్తానని.. దానికి సంబంధించిన పట్టాలు కూడా ప్రభుత్వమే ఇస్తుందని చెప్పడంతో పొలిటికల్ వార్ కాస్తా ల్యాండ్ వార్‌గా మారింది. అయితే ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ ల్యాండ్ అంతా సక్రమంగా పొందినది కాదని తేలితే పరిస్థితి ఏంటనే సందేహం బీఆర్ఎస్ శ్రేణుల్లో బలంగా వినిపిస్తోంది. అంతే కాదు అసలు కేసీఆర్ ఫామ్ హౌస్‌కి వెళ్లిన దళితుల వల్ల ఆ స్థలం అపవిత్రం అయిందని పసుపు నీళ్లతో శుద్ధి చేసిన వాళ్లలో ప్రధానంగా వినిపించిన పేరు పావని గౌడ్..? అసలు ఎవరీ పావనీ గౌడ్..? ఆమెకు బీఆర్ఎస్కి సంబంధం ఏంటీ..? అసలు ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంది..? అనే డౌట్స్ వస్తుంటే.. బీఆర్ఎస్ అభిమానులు మాత్రం ఆమె చేసిన పనికి తీవ్రంగా తిట్టిపోస్తున్నారు. అసలు ఈ స్టోరీ మూలాల నుంచి ఒక్కసారి పరిశీలిస్తే ఏం జరిగిందో తెలుస్తుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత మొదటగా ఫోకస్ చేసింది రాష్ట్రంలోని భూములపైనే అనేది అందరికి తెలిసిన విషయమే. హైడ్రా పేరుతో హైదరాబాద్ పట్టణ, శివార్లలోని వేల ఎకరాల్లో కట్టిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ వస్తున్న రేవంత్ రెడ్డి సర్కారుపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు అదే అంశంపై విమర్శలు చేస్తూ వచ్చారు. తాజాగా ప్రభుత్వం తెచ్చిన 22A పై కూడా అసెంబ్లీలో, బయట రచ్చ రచ్చ చేశారు. ఇదంతా కాంగ్రెస్, రేవంత్ రెడ్డి సొంతవర్గం భూములు కాజేసేందుకు తెచ్చిన జీవో అంటూ ఆరోపణలు చేశారు. దీనికి బదులుగానే బుధవారం అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో పాలన కొనసాగించిన కేసీఆర్ రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ భూములను అక్రమంగా రికార్డులు తారుమారు చేసి లక్షల కోట్ల భూకుంభకోణానికి తెరతీశారని విమర్శించారు. ఇందులో భాగంగానే కేసీఆర్ ప్రస్తుతం ఉంటున్న 388 ఎకరాల ఎర్రవల్లి ఫామ్ హౌస్ కూడా ఆ విధంగా సొంతం చేసుకున్నదేనని చెప్పారు. ఆ భూమి దళితులదని.. భూమి వివరాలు, పట్టాలు, రిజిస్ట్రేషన్ జరిగిన తీరుపై పూర్తి విచారణకు ఆదేశించారు. అయితే ఈ వివాదం 22A రద్దు కోసం బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచుదామనుకుంటే గేమ్ రివర్స్ అయింది.
Now #BRS Working President #KTR throws open a challenge to CM #RevanthReddy: “Let a sitting HC/SC judge probe the assets of both our families.”
The challenge comes after CM said in the Assembly that #KCR’s extended family holds 439.3 acres and ordered a probe into 388 acres… pic.twitter.com/XZoXaClVGo
— Ashish (@KP_Aashish) September 17, 2026
అయితే ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ భూమి వివాదం కంటే అక్కడ వరదరాజ్పూర్కి చెందిన ఏడుగురు బీఆర్ఎస్ నేతలు దళితులు అడుగుపెట్టినందుకు శుద్ధి పేరుతో పసుపు నీళ్లతో కడిగారు. ఇందులో ప్రముఖంగా కనిపించిన పేరు పావనీ గౌడ్. ఈమె కూడా బీఆర్ఎస్ నేత కావడంతో ఇప్పుడు సొంత పార్టీ నేతలే ఆమెను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అమ్మ పావని ఏడున్నావ్ తల్లి.. నీ పసుపు నీళ్లు KCR ఫామ్‌హౌస్‌కి ఉరితాడు మారిందంటూ ఆమె ఫోటోలను షేర్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఏ ముహూర్తాన ఫామ్ హౌస్ దగ్గర పసుపు నీళ్లు చల్లినవో కాని మొత్తానికి కెసిఆర్ ఫామ్‌హౌస్‌కి సంకెళ్ళు పడుతున్నాయి పో అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
అమ్మ పావని ఏడున్నావ్ తల్లి…. నీ పసుపు నీళ్లు KCR ఫామ్‌హౌస్‌కి ఉరితాడు అయింది గా
ఏ ముహూర్తాన చల్లినవో కానీ మొత్తానికి కెసిఆర్ ఫామ్‌హౌస్‌కి సంకెళ్ళు పడుతున్నాయి పో pic.twitter.com/3Yu8FfjFxM
— BRS paid batch (@BrsPaid43988) September 17, 2026
అయితే ఇప్పటికే ఈవ్యవహారంలో దళితుల్ని కించపరిచారంటూ వరదరాజ్ పూర్‌కి చెందిన ఏడుగురు బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ ఫాంహౌస్ ముందు పసుపు నీళ్లతో శుద్ది చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వాళ్లను రిమాండ్‌కి కూడా తరలించారు.15 రోజుల రిమాండ్ విధించిన వాళ్లలో పావని గౌడ్ ఉందా ..? ఉంటే ఆమెకు బీఆర్ఎస్ పార్టీతో కేసీఆర్‌తో ఎలాంటి రిలేషన్ ఉందనే కోణంలో కూడా ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది.
అయితే నెల రోజుల్లో కేసీఆర్ ఫామ్ హౌస్ ల్యాండ్ అక్రమమా లేక సక్రమమా అనే విషయాన్ని తేల్చాలని సీఎం ఆదేశాలతో ఇప్పటికే రెవిన్యూ అధికారులు ఎర్రవల్లి వెళ్లి పూర్తి ఆధారాలు సేకరిస్తున్నారు. రిజిస్ట్రేషన్ డాక్యూమెంట్స్‌తో పాటు చుట్టుపక్కల భూములు, గ్రామాల ప్రజల స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. అయితే ఏదైతే ప్రభుత్వం కేసీఆర్‌కి చెందిన సుమారు 400 ఎకరాల భూమిపై ఆరోపణలు చేస్తుందో.. అది తమదేనని ప్రభుత్వ లెక్కలు, స్టాంప్ డ్యూటీ ప్రకారమే కొనుగోలు చేసినట్లుగా ఆధారాలున్నాయని కేటీఆర్ చేసిన సవాళ్లను నిజం కాదని నిరూపించడం కోసం రేవంత్ సర్కారు ఆపరేషన్ ఫామ్ హౌస్ పేరుతో ఎర్రవల్లిలో పావులు కదువుతున్నారు. ఇంకొన్ని రోజులు గడిస్తే ఇది ఎవరి భూమి.. మాజీ సీఎంకి చెందిన భూమిని ప్రభుత్వం జప్తు చేసుకొని పేదలకు పంచి పెట్టవచ్చా.. లేదా దీనిపై బీఆర్ఎస్ ఎలాంటి న్యాయపోరాటం చేస్తుందనే అంశాలు ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.














