Last Updated:
Telangana 22A Land Issues: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శాసన సభలో చేసిన ప్రకటనకు అనుగుణంగా 22-A కు సంబంధించిన అన్ని అంశాలను ఫాస్ట్ ట్రాక్ లో పరిష్కరించడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లుగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. ఇందుకు సంబంధించి జీ.ఓ.ఆర్.టి నెం. 564 ను , జారీచేసినట్లు తెలిపారు.
Telangana 22A Land Issues: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శాసన సభలో చేసిన ప్రకటనకు అనుగుణంగా 22-A కు సంబంధించిన అన్ని అంశాలను ఫాస్ట్ ట్రాక్ లో పరిష్కరించడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లుగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. ఇందుకు సంబంధించి జీ.ఓ.ఆర్.టి నెం. 564 ను , జారీచేసినట్లు తెలిపారు. ఈ కమిటీకి చైర్మన్ గా సిసిఎల్ఎ డి.ఎస్. లోకేష్ కుమార్ వ్యవహరిస్తారు. లా సెక్రటరీ, పాపి రెడ్డి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఐ.జీ. రాజీవ్ గాంధీ హనుమంతు సభ్యులుగా ఉంటారని మంత్రి తెలిపారు.
రాష్ట్రంలో భూములపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య గత కొద్దిరోజులుగా వివాదం నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన 22A పూర్తిగా న్యాయబద్దమైనది కాదని దాన్ని రద్దు చేయాలని బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీలో, బయట నిరసనలు, ధర్నాలు చేపట్టారు. అయితే దీనికి కొనసాగింపుగానే శుక్రవారం అసెంబ్లీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి శాసన సభలో చేసిన ప్రకటనకు అనుగుణంగా 22-A కు సంబంధించిన అన్ని అంశాలను ఫాస్ట్ ట్రాక్ లో పరిష్కరించడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లుగా ప్రకటించారు.

సీఎం రేవంత్ రెడ్డి మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులుగా ఆనాడు ఎల్ బి నగర్ నియోజకవర్గంలోని పలు కాలనీల్లో ఉన్న రెగ్యులరైజేషన్ సమస్యను పరిష్కరిస్తానని ఇచ్చిన హామీ మేరకు రంగారెడ్డి జిల్లాలోని ఎల్.బి. నగర్ నియోజకవర్గంలో 118 జీ.ఓ. ప్రకారం 9,700 ప్లాట్ల రేగ్యులరైజేషన్ కు సంబంధించిన మెమోను శుక్రవారం నాడు జారీ చేయడం జరిగిందన్నారు. ఈ జీ.ఓ. ప్రకారం ఆ ప్రాంతంలో రేపటి నుంచి రెగ్యులరైజేషన్ ప్రక్రియ ప్రారంభిస్తున్నామని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.
దశాబ్దాల కాలంగా అక్కడ ప్లాట్లు తీసుకొని ఇండ్ల నిర్మాణం చేసుకొని నివాసం ఉంటున్న ఇండ్ల యజమానులు 118 జీ.ఓ. ప్రకారం స్థానిక అధికారులను సంప్రదించి నిబంధనల ప్రకారం రెగ్యులరైజ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసారు మంత్రి పొంగులేటి. సింగరేణి ప్రాంతంలో ఇండ్ల స్ధలాల రెగ్యులరైజేషన్‌కు సంబంధించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జీవో 76ను జారీ చేశారని ఆ జీవోను అనుసరించి శనివారం నాడు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి రెగ్యులరైజేషన్ ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు.
అదే విధంగా రెవెన్యూ రికార్డులలో 22ఎలో ఉండి హెచ్ఎండిఎ (HMDA),డిటిసిపి(DTCP),జిహెచ్ఎంసీ(GHMC) అనుమతులతో లేఅవుట్లు వేసిన ప్రాంతాలను 22ఎ నుంచి తొలగించే విషయంలో ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. శాసనసభలో సీఎం ప్రకటించిన 10-12 అంశాలపై నెలరోజుల వ్యవధిలోనే నిర్ణయం తీసుకొని 22ఎ దరఖాస్తుదారులకు ఉపశమనం కల్పిస్తామని సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.














