Kotta malupu Review: సింగర్ సునీత కొడుకు కొత్త మలుపు రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

టాలీవుడ్ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ గోపరాజు హీరోగా నూతన నటి భైరవి ఆర్థ్యా కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘కొత్త మలుపు’. జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం..

News18
News18

ప్రముఖ టాలీవుడ్ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ గోపరాజు హీరోగా నూతన నటి భైరవి ఆర్థ్యా కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘కొత్త మలుపు’. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వంలో తథాస్తు క్రియేషన్స్ బ్యానర్‌పై తాటి బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.

కథా నేపథ్యం:

హైదరాబాద్‌లో స్నేహితులతో జాలీగా గడిపే కమల్ (ఆకాష్), ఒక వివాహ వేడుక కోసం కోనసీమకు వెళ్తాడు. అక్కడ వరలక్ష్మి (భైరవి) అనే గ్రామీణ యువతితో ప్రేమలో పడతాడు. అయితే, కమల్ జీవితంలో ఎదురైన ఒక క్లిష్ట పరిస్థితి, దాని చుట్టూ అల్లుకున్న అపార్థాలు వీరి ప్రేమను ఎలాంటి మలుపులు తిప్పాయనేదే ఈ చిత్ర ముఖ్య కథాంశం. నేటి యువత ప్రేమలో పడే అపార్థాలు, ఒకరి గతాన్ని గౌరవించాల్సిన ఆవశ్యకతను దర్శకుడు ఈ కథ ద్వారా సందేశాత్మకంగా చూపించారు.

సినిమా ఎలా ఉందంటే..

దర్శకుడు శివ కేసనకుర్తి ఎంచుకున్న పాయింట్ పాతదే అయినా, దానికి గోదావరి అందాలను, పల్లెటూరి సంస్కృతిని జోడించి ఫ్రెష్‌గా ప్రెజెంట్ చేశారు. మొదటి భాగం మొత్తం పెళ్లి సందడి, స్నేహితుల హంగామా, రఘుబాబు – పృథ్వీ మార్క్ కామెడీతో ఎంతో వినోదాత్మకంగా సాగిపోతుంది. ఇక సెకండాఫ్‌లో కథ కాస్త ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. ప్రేమలో అనుమానం వల్ల వచ్చే నష్టాలను చూపిస్తూ క్లైమాక్స్‌ను హృద్యంగా ముగించారు. లీడ్ పెయిర్ ఆకాష్, భైరవిల మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. యశ్వంత్ నాగ్ సంగీతం, సుమంత్ కచర్ల సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి రిచ్ విజువల్స్ అందించాయి.

సెకండాఫ్‌లో కొన్ని సీన్లు కాస్త నెమ్మదించినప్పటికీ, ఓవరాల్‌గా ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ క్లీన్ ఎంటర్‌టైనర్‌గా ‘కొత్త మలుపు’ నిలిచింది. మొత్తంగా చెప్పాలంటే ఇది వీకెండ్‌లో హాయిగా నవ్వుకునే ఫీల్ గుడ్ మూవీ.

రేటింగ్: 3

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed