Makutam Teaser: విశాల్ స్వీయ దర్శకత్వంలో మకుటం.. యాక్షన్ మోడ్‌లో టీజర్‌ అదిరిందబ్బా..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

హీరో విశాల్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా మకుటం. ఇందులో విశాల్ హీరోగా కూడా నటించడం విశేషం. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.

News18
News18

‘మార్క్ ఆంటోనీ’, ‘మద గజ రాజా’ చిత్రాలతో విశాల్ మంచి విజయాల్ని అందుకున్నారు. విశాల్ కెరీర్‌లోనే ‘మకుటం’ ఓ స్పెషల్ ప్రాజెక్ట్‌గా నిలబోతోంది. హీరోగా, దర్శకుడిగా విశాల్ చేసిన తొలి ప్రాజెక్ట్ ఇదే. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో 99వ సినిమాగా ‘మకుటం’ రూపుదిద్దుకుంటోంది. స్వర్గీయ నిర్మాత ఆర్.బి. చౌదరి ఆధ్వర్యంలో ఈ ప్రతిష్టాత్మక చిత్రం రాబోతోంది. రవి అరసు అందించిన కథ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్ అన్నింటికీ ఆడియెన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. తాజాగా ఈ సినిమా టీజర్‌ విడుదల చేశారు.

మండుతున్న శవం.. అందులోంచి సిగరెట్ వెలిగించుకుంటూ ఇచ్చిన హీరో ఎంట్రీ అదిరిపోయింది. ఇక ఇందులో అంజలి మాస్ యాక్షన్‌ను చూడొచ్చు. అంజలి ఓ కొత్త అవతారంలో కనిపించనున్నారు. ఇక విశాల్ అయితే మూడు డిఫరెంట్ గెటప్స్‌లో తన విశ్వరూపం చూపించారు. ఈ టీజర్‌లోని విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, బీజీఎం అన్నీ కూడా అద్భుతంగా కుదిరాయి. ఇదొక యాక్షన్ ప్యాక్డ్ మూవీ అని టీజర్‌ని చూస్తేనే తెలుస్తోంది. హీరోగా, దర్శకుడిగా విశాల్ అద్భుతమైన పనితీరుని కనబర్చారని టీజర్ స్పష్టంగా చెబుతోంది.

స్టైలిష్, విజువల్ ట్రీట్‌లా విశాల్ ఈ మూవీని తెరకెక్కించారు. సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం నాథన్, జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన బలం కానున్నాయి. ఈ సినిమాకి ఎడిటర్‌గా ఎన్.బి. శ్రీకాంత్, జి. దురైరాజ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేశారు. మొత్తం మీద ఈ టీజర్‌ ఒక్కసారిగా ‘మకుటం’పై భారీ అంచనాల్ని పెంచేసింది. విశాల్ త్రిపాత్రాభినయం, స్టైలిష్ దర్శకత్వం, ఆకట్టుకునే సాంకేతిక నైపుణ్యం, ఆసక్తికరమైన కథనం అన్నీ కలిసి ఈ చిత్రాన్ని అతని కెరీర్‌లోనే క్రేజీ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలబెట్టాయి. ‘మకుటం’ జూలైలో విడుదల కానుంది.

ఆర్.బి. చౌదరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో విశాల్, దుషార విజయన్, అంజలి, తంబి రామయ్య, అర్జై తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed