Last Updated:
ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 205, జోఫ్రా ఆర్చర్ 32, ముంబై బౌలర్లలో శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్ చెరో 2 వికెట్లు.
ప్లేఆఫ్స్ కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోర్ సాధించింది. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆర్ఆర్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు సాధించింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న వైభవ్ సూర్యవంశీ (2).. ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. మరో ఓపెనర్ జైశ్వాల్ 27 (1 ఫోర్, 3 సిక్సులు) వేగంగా పరుగులు బాదినా.. త్వరగా వికెట్ సమర్పించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ధ్రువ్ జురెల్ 38 (3 ఫోర్లు, 2 సిక్సులు), దసున్ శనక 29 (3 సిక్సులు) కాస్త పర్వాలేదనిపించినా.. కెప్టెన్ పరాగ్ (14), ఫెరేరా (18), శుభమ్ దూబే (5) తక్కువ పరుగులకే ఔటయ్యారు. ఐతే వరుస క్రమంలో వికెట్లు కోల్పోయినా.. వచ్చిన ప్రతి బ్యాటర్ వేగంగా పరుగులు సాధించి, వెనుదిరిగారు.
ఇక చివర్లో జోఫ్రా ఆర్చర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 15 బంతుల్లో 32 (1 ఫోర్, 3 సిక్సులు) పరుగులు బాదాడు. చివర్లో జడేజా 19 (3 ఫోర్లు) వరుసగా బౌండరీలు సాధించడంతో రాజస్థాన్ స్కోర్ 205 చేరుకుంది. ఐతే వాంఖడే పిచ్ ని బట్టి చూస్తే ఈ స్కోర్ తక్కువనే చెప్పాలి. ముంబై బ్యాటింగ్ ఆర్డర్ అద్భుతంగా ఉంది. మరి రాజస్థాన్ ఈ స్కోర్‌ను కాపాడుకుంటారా లేదా అని వేచిచూడాలి.
ఇక ముంబై బౌలర్లలో శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. విల్ జాక్స్, ఘజన్‌ఫర్, కార్బిన్ బాష్ చెరో వికెట్ తీసుకున్నారు.
లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana













