Mohan Bhagwat: RSS చీఫ్ మోహన్ భగవత్‌‌కు తృటిలో తప్పిన ప్రమాదం..! | | ACTPnews

మోహన్ భగవత్


Last Updated:

ఈ దాడి జరిగిన సమయంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)చీఫ్ మోహన్ భాగవత్ అదే రైల్లో ప్రయాణిస్తున్నారు.

మోహన్ భగవత్
మోహన్ భగవత్

RSS Mohan Bhagwat : కాన్పూర్ నుండి దిల్లీ వెళ్తున్న హైస్పీడ్ ‘స్వర్ణ శతాబ్ది ఎక్స్‌ప్రెస్’ (Swarna Shatabdi Express) రైలుపై గురువారం గుర్తుతెలియని దుండగులు దారుణంగా రాళ్ల దాడికి పాల్పడ్డారు. అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. ఈ దాడి జరిగిన సమయంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)చీఫ్ మోహన్ భగవత్ అదే రైల్లో ప్రయాణిస్తున్నారు. ఫిరోజాబాద్ – మఖన్‌పూర్ స్టేషన్ల మధ్య ఈ ఘటన చోటుచేసుకోవడంతో రైల్వే పరిపాలన విభాగం, భద్రతా సంస్థలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.

ఔటర్‌పైనే నిలిపివేత.. అధికారుల తనిఖీలు

రైలుపై రాళ్ల దాడి జరిగిన వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ముందస్తు భద్రతా చర్యగా స్వర్ణ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను తుండ్లా జంక్షన్‌కు ముందే ఔటర్ వద్ద నిలిపివేశారు. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే ఉన్నతాధికారులు, రైల్వే రక్షణ దళం (RPF) జవాన్లు అత్యవసరంగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. దుండగులు రాళ్లు రువ్విన కోచ్‌ను, అందులోని ప్రయాణికుల భద్రతను అధికారులు నిశితంగా పరిశీలించారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని నిర్ధారించుకున్న తర్వాతే రైలును తిరిగి దిల్లీకి పంపించారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ రాళ్ల దాడిలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. దీంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. భద్రతా సంస్థలు ఈ ఉదంతాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించి దర్యాప్తును ముమ్మరం చేశాయి. రైల్వే ట్రాక్ పరిసర ప్రాంతాల్లో రాళ్లు రువ్విన గుర్తుతెలియని నిందితుల కోసం స్థానిక పోలీసులు, ఆర్‌పీఎఫ్ బలగాలు కలిసి గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ఘటన తర్వాత సదరు రైల్వే మార్గంలో భద్రతను, గస్తీని మరింతగా పెంచారు.

ఈ-1 కోచ్ విండో గ్లాస్ ధ్వంసం.. కేసు నమోదు

ఈ ఘటనపై ఆర్‌పీఎఫ్ పోస్ట్ ఇన్‌ఛార్జ్ ఇన్‌స్పెక్టర్ నరేష్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రైల్వే చట్టంలోని సెక్షన్ 152 కింద కేసు నమోదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. రైలు నంబర్ 12003 స్వర్ణ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ వెళ్తున్న సమయంలో, ఒక గుర్తుతెలియని వ్యక్తి రైలులోని ‘ఈ-1’ (E-1) కోచ్‌పైకి రాయి విసిరాడు. ఆ రాయి వచ్చి సదరు కోచ్‌లోని బర్త్ నంబర్ 53, 54ల వద్ద బలంగా తగిలింది.

ఈ దాడి తీవ్రతకు ఆ విండో (కిటికీ) యొక్క వెలుపలి గ్లాస్ పూర్తిగా పగిలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖ్ మోహన్ భగవత్ అదే కోచ్‌లో ప్రయాణిస్తున్నప్పటికీ, ఆయనకు ఎలాంటి అపాయం జరగలేదు. ఆయనతో పాటు మిగిలిన ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే పోలీసులు నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed