Mojtaba Khamenei: సస్పెన్స్‌కు తెర.. వచ్చే వారం ప్రజల ముందుకు ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ | | ACTPnews

మోజ్తబా ఖమేని


Last Updated:

Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తన తండ్రి దివంగత అయాతొల్లా అలీ ఖమేనీ జ్ఞాపకార్థం మంగళవారం టెహ్రాన్‌లో భారీ సంస్మరణ సభను నిర్వహించనున్నట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది.

మోజ్తబా ఖమేని
మోజ్తబా ఖమేని

అయితే ఈ కార్యక్రమానికి ఆయన స్వయంగా హాజరవుతారా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు. అధికారిక ప్రకటన ప్రకారం, ఈ సంస్మరణ సభ జూలై 23, మంగళవారం సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు జరగనుంది. ఈ నోటీసులో దివంగత ఇరాన్ నేతను “అమరవీరుడైన ముజాహిద్ ఇమామ్” (martyred mujahid Imam) గా అభివర్ణించారు. తండ్రి మరణం తర్వాత ఇరాన్ అత్యున్నత నాయకుడిగా (సుప్రీం లీడర్) బాధ్యతలు చేపట్టినప్పటి నుండి మొజ్తబా ఖమేనీ ప్రజల ముందుకు రాకపోవడం గమనార్హం.

తండ్రి అంత్యక్రియలకు దూరంగా మొజ్తబా

ఇటీవల అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా జరిగిన అతిపెద్ద సంతాప సభలో కూడా మొజ్తబా ఖమేనీ ఎక్కడా బహిరంగంగా కనిపించలేదు. ఆయన ముగ్గురు సోదరులు మాత్రమే తండ్రి అంత్యక్రియల ప్రార్థనలను నడిపించారు.

టెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమేని గ్రాండ్ మొసల్లాలో వేలాది మంది శోకసంద్రంలో మునిగిపోగా.. అలీ ఖమేనీ, ఆయన కుమార్తె, అల్లుడు, కోడలు మరియు 14 నెలల మనవరాలి శవపేటికల పక్కన మోస్తఫా, మేసమ్ మరియు మసౌద్ ఖమేనీలు నిలబడి ఉన్న దృశ్యాలను ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ప్రసారం చేసింది. దాడిలో తండ్రి మరణించిన తర్వాత దేశంలోనే అత్యున్నత పదవిని చేపట్టినప్పటికీ, కొత్త సుప్రీం లీడర్ ప్రజల ముందుకు రాకపోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకుంటానని మొజ్తబా శపథం

అంత్యక్రియలు ముగిసిన కొద్ది రోజులకే మొజ్తబా ఖమేనీ తన మొదటి బహిరంగ ప్రకటనను విడుదల చేశారు. ఫిబ్రవరి చివరలో అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి వైమానిక దాడులలో మరణించిన తన తండ్రి మరణానికి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఏఎఫ్‌పీ (AFP) వార్తా సంస్థ నివేదిక ప్రకారం, కొత్త సుప్రీం లీడర్ ఒక ప్రకటనలో ఇలా పేర్కొన్నారు.

“ప్రతీకారం అనేది మా దేశం యొక్క సంకల్పం, దీనిని మేము ఖచ్చితంగా అమలు చేసి తీరుతాము. ఈ నిర్ణయం నా వ్యక్తిగత మనుగడపై కానీ లేదా ఇతర అధికారుల ఉనికిపై కానీ ఆధారపడి లేదు. మేము ఉన్నా లేకపోయినా, ఈ ప్రతీకారం జరిగి తీరుతుంది.”

తనను వధించడానికి ప్రయత్నిస్తే ఇరాన్‌ను పూర్తిగా నాశనం చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన కొద్ది గంటల్లోనే మొజ్తబా ఈ ప్రకటన చేయడం గమనార్హం. తాము టార్గెట్ చేయాల్సిన వ్యక్తుల జాబితాను కూడా ఇస్లామిక్ రిపబ్లిక్ సిద్ధం చేసిందని ఆయన వెల్లడించారు.

మళ్లీ పెరుగుతున్న అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు

జూన్ 17 నాటి తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలమవడంతో టెహ్రాన్ మరియు వాషింగ్టన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ముదిరాయి. గత కొన్ని రోజులుగా ఇరుదేశాలు పరస్పరం దాడులు చేసుకోవడమే కాకుండా, ఘాటైన వ్యాఖ్యలతో పగను పెంచుకుంటున్నాయి, ఇది ఈ ప్రాంతంలో సరికొత్త యుద్ధ భయాలను రేకెత్తిస్తోంది.

ఈ నేపథ్యంలో, మంగళవారం జరగబోయే సంస్మరణ సభ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది దివంగత నేతకు నివాళి అర్పించడమే కాకుండా, అధికార బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ మొదటిసారి ప్రజల ముందుకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఆయన వ్యక్తిగతంగా వస్తారా లేదా అనేది ఇరాన్ అధికారులు ఇంకా ధృవీకరించలేదు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports