Mrunal Thakur: నాలుగేళ్ల తర్వాత నేరుగా ఓటీటీలోకి మృనాళ్ థాకూర్ కొత్త సినిమా..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

‘డెకాయిట్’ సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మృణాల్ ఠాకూర్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన చిత్రంతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ త్రిల్లర్ ‘పూజా మేరీ జాన్’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది.

News18
News18

‘డెకాయిట్’ సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మృణాల్ ఠాకూర్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన చిత్రంతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ త్రిల్లర్ ‘పూజా మేరీ జాన్’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్నో కారణాలతో దాదాపు నాలుగేళ్లుగా విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాకు ఇప్పుడు మోక్షం లభించింది.

మృణాల్ ఠాకూర్‌తో పాటు హ్యూమా ఖురేషి కీలక పాత్రలో నటించిన ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 డిజిటల్ స్ట్రీమింగ్ కోసం సొంతం చేసుకుంది. తమ రాబోయే కొత్త కంటెంట్ జాబితాలో ఈ సినిమాను అధికారికంగా చేర్చినట్లు జీ5 ప్రకటించింది. అయితే సినిమా ఏ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుందనే విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు. దీంతో విడుదల తేదీపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

ఈ చిత్రానికి నవజ్యోత్ గులాటి దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాత దినేష్ విజన్ తన మ్యాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించారు. విక్రమ్ సింగ్ చౌహాన్, విజయ్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. థ్రిల్లర్, సస్పెన్స్ అంశాలతో పాటు నేటి డిజిటల్ ప్రపంచంలో పెరుగుతున్న సైబర్ వేధింపులపై ఈ సినిమా దృష్టి సారించడం విశేషం.

కథ విషయానికి వస్తే.. పూజా అనే సాధారణ యువతి జీవితంలోకి ఒక అపరిచిత వ్యక్తి ప్రవేశిస్తాడు. ఆమెపై అతడికి ప్రమాదకరమైన స్థాయిలో మోజు పెరుగుతుంది. ఆమె ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా, సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేసినా అతను ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉంటాడు. ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, సోషల్ మీడియా, ఇంటర్నెట్ వంటి డిజిటల్ మార్గాల ద్వారా పూజాను నిరంతరం వేధిస్తుంటాడు.

ఆ వ్యక్తి వల్ల పూజా మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతుంది. తన వ్యక్తిగత జీవితం పూర్తిగా గందరగోళంగా మారిపోతుంది. తన ప్రతి అడుగును ఎవరైనా గమనిస్తున్నారనే భయంతో ఆమె జీవితం నరకంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు? అతని అసలు ఉద్దేశం ఏమిటి? అతని బారి నుంచి పూజా ఎలా బయటపడింది? తనను తాను ఎలా రక్షించుకుంది? అనే ప్రశ్నలకు సమాధానమే ‘పూజా మేరీ జాన్’ సినిమా.

డిజిటల్ యుగంలో వ్యక్తిగత గోప్యత ఎంత ముఖ్యమో, సోషల్ మీడియా ద్వారా ఒకరి జీవితంలోకి ఎంత సులభంగా చొరబడవచ్చో ఈ సినిమా ఆసక్తికరంగా చూపించబోతోందని తెలుస్తోంది. సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో పాటు బలమైన సామాజిక సందేశాన్ని కూడా ఈ చిత్రం అందించనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. విడుదలకు ముందే ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొనగా, ఓటీటీ ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed