Last Updated:
నటసింహం, టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రమాదానికి గురయ్యారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పోర్ట్ ప్రాంగణంలో జరుగుతున్న ఆయన తాజా చిత్రం (NBK111) షూటింగ్‌లో ఈ ఊహించని ఘటన చోటుచేసుకుంది.
నటసింహం, టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రమాదానికి గురయ్యారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పోర్ట్ ప్రాంగణంలో జరుగుతున్న ఆయన తాజా చిత్రం (NBK111) షూటింగ్‌లో ఈ ఊహించని ఘటన చోటుచేసుకుంది. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో ఆయన అనుకోకుండా కాలుజారి కిందపడటంతో గాయాలపాలయ్యారు. ఈ వార్త బయటకు రావడంతో నందమూరి అభిమానులు, సినీ వర్గాల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.
‘వీరసింహా రెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని, బాలకృష్ణ కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘NBK111’. ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతం కాకినాడ పోర్ట్, దాని పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగా టాలీవుడ్ హీరో మంచు మనోజ్, బాలకృష్ణ మధ్య ఓ కీలకమైన, భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నారు. హై ఓల్టేజ్ ఫైట్ సీక్వెన్స్ తీస్తున్న సమయంలో బ్యాలెన్స్ తప్పడంతో బాలయ్య ఒక్కసారిగా కిందపడిపోయారు. ఈ క్రమంలో ఆయన మోకాలికి స్వల్ప గాయమైంది.
ప్రమాదాన్ని గమనించిన దర్శకుడు గోపీచంద్ మలినేని, ఇతర చిత్ర యూనిట్ సభ్యులు వెంటనే అప్రమత్తమై షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. స్పాట్‌లో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, మెరుగైన వైద్యం నిమిత్తం బాలకృష్ణను కాకినాడలోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. వైద్యులు ఆయనకు అవసరమైన పరీక్షలు చేసి చికిత్స అందించారు. గాయం స్వల్పమేనని, ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని, అయితే కొన్ని రోజుల పాటు ఆయనకు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
వయసుతో సంబంధం లేకుండా కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోని ఎనర్జీతో బాలకృష్ణ సినిమాలు చేస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలకు పెట్టింది పేరైన బాలయ్య.. చాలా వరకు డూప్ లేకుండా సొంతంగా రిస్క్ చేసి మరీ ఫైట్స్ చేస్తుంటారు. ఈ సినిమాలో మంచు మనోజ్ పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. వీరిద్దరి మధ్య వచ్చే ఈ ఫైట్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్‌గా నిలవనుందని తెలుస్తోంది. ప్రస్తుతానికి విశ్రాంతి తీసుకుంటున్న బాలయ్య త్వరలోనే కోలుకుని తిరిగి సెట్స్‌లో అడుగుపెట్టనున్నారు. బాలయ్య త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana














