Last Updated:
చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి సినిమాలు చేశాడు అనే పేరు తెచ్చుకున్నాడు నారా రోహిత్. రాజకీయాల్లో చక్రాలు తిప్పిన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా అవన్నీ కాదని సినిమాల్లోకి వచ్చాడు.
చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి సినిమాలు చేశాడు అనే పేరు తెచ్చుకున్నాడు నారా రోహిత్. రాజకీయాల్లో చక్రాలు తిప్పిన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా అవన్నీ కాదని సినిమాల్లోకి వచ్చాడు. స్టార్ హీరో కాలేకపోయాడు కానీ.. కంటెంట్ సినిమాలు చేశాడు అని క్రేజ్ మాత్రం సంపాదించుకున్నాడు. ఈ మధ్య కాస్త్ గ్యాప్ ఇచ్చాడు కానీ.. పదేళ్ల ముందు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించాడు. రెండు ఏళ్ల ముందు తనతో నటించిన కో స్టార్‌నే పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు.
ఆ తర్వాత ‘భైరవం’, ‘సుందరకాండ’ వంటి సినిమాలతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇప్పుడు సరికొత్త కాన్సెప్ట్‌తో కొత్త సినిమాతో రాబోతున్నాడు. అదే సౌండ్ ఇంజనీర్. తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజైంది. ఈ సినిమాలో నారా రోహిత్ చెవిటి వాడిగా నటించబోతున్నాడు. దీనికి సంబంధించిన గ్లింప్స్ హిలేరియస్‌గా ఉంది. చినిమిల్లి మణి కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కరణ్ సీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భరత్ చౌదరీ నిర్మిస్తున్నాడు. నయన్ సారిక హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతుంది.
ఇక 2009లో వచ్చిన ‘బాణం’ సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు నారా రోహిత్. చైతన్య దంతులూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా కమర్షియల్‌గా ఆడలేదు కానీ.. క్రిటిక్స్ నుంచి చాలా పాజిటీవ్ రివ్యూలు వచ్చాయి. మరీ ముఖ్యంగా డెబ్యూ సినిమాలోనే యాక్టింగ్ కుమ్మేశాడని పేరు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత చేసిన ‘సోలో’ సినిమా మాత్రం నారా రోహిత్‌కు సూపర్ డూపర్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమా ఏకంగా రూ.8 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ సాధించి నారా రోహిత్‌కు మంచి కమర్షియల్ హిట్‌గా నిలిపోయింది.
ఆ తర్వాత ఒక్కడినే, ప్రతినిధి, రౌడీ ఫెలో, అసుర ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశాడు. ఇవేవి కమర్షియల్‌గా బ్లాక్ బస్టర్ హిట్లు కాలేవు. కానీ ఇందులో ఉన్న ప్రతీ సినిమా ఒక డైమండే. ఒక్కసారి ఈ సినిమాలు చూస్తే.. నారా రోహిత్ స్క్రిప్ట్ సెలక్షన్ ఎంత బాగుంటుందో తెలుస్తుంది. ఆ తర్వాత కొన్ని సినిమాలు గాడీ తప్పాయి. తుంటరీ, సావిత్రి ఇలా కొన్ని ఫ్లాప్ సినిమాలు కూడా పడ్డాయి. నాయకీ, మెంటల్ మదిలో, నీది నాది ఒకే కథ వంటి పలు సినిమాల్లో గెస్ట్ అప్పియరెన్స్ కూడా ఇచ్చాడు. ఇక 2024లో తనతో కలిసి ప్రతినిధి సీక్వెల్లో హీరోయిన్గా నటించిన సిరీ లిల్లాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














