Last Updated:
ఈ సాంగ్‌లో నయనతార సిగరెట్ తాగడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తన సినిమా కెరీర్లో ఇప్పటి వరకు చాలా జాగ్రత్తగా పాత్రలు ఎంచుకునే నయనతార.. ఇప్పుడు సడెట్ను ఇలా స్మోక్ చేస్తూ కనిపించడం నెట్టింట చర్చనీయాంశమైంది.
‘వైలెన్స్.. వైలెన్స్.. వైలెన్స్.. ఐ డోంట్ లైక్ ఇట్, ఐ ఆవాయిడ్.. బట్ వైలెన్స్ లైక్స్ మీ.. ఐ కాంట్ అవాయిడ్’ అనే డైలాగ్ గుర్తిందిగా. కేజీఎఫ్ సినిమాలో యష్ చెప్పిన ఈ డైలాగ్‌ను ఆయనే గట్టిగా ఫాలో అవుతున్నాడు. ఎంతలా అంటే.. ఇప్పుడు ఆయనకున్న మాస్ అప్పియరెన్స్‌కు ఖచ్చితంగా వైలెన్స్ ఉన్న సినిమానే చేయాలి లేదంటే జనాలు యాక్సెప్ట్ చేయరు అనేంతలా. అందుకే.. కేజీఎఫ్ సిరీస్ తర్వాత ఎన్నో కథలు విని చివరికి ‘టాక్సిక్’ సినిమా కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. మరీ ముఖ్యంగా ఈ సినిమా టీజర్ రిలీజైన తర్వాత ఇండియాలో పెను సంచలనమే సృష్టించింది. కొందరు హాలీవుడ్ స్టైల్ మేకింగ్ అని పొగడ్తలు కురిపిస్తే.. మరికొందరు మాత్రం మసాలా కంటెంట్ ఏంటి ఈ రేంజ్లో ఉంది అంటూ కామెంట్స్ చేశారు. ఎన్నో వాయిదాల తర్వాత ఈ సినిమా ఆగస్టు 26న రిలీజ్ కాబోతుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సెకండ్ సింగిల్ ‘మానసాగదే’ను రిలీజ్ చేశారు.
కాగా.. ఈ సాంగ్‌లో నయనతార సిగరెట్ తాగడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తన సినిమా కెరీర్లో ఇప్పటి వరకు చాలా జాగ్రత్తగా పాత్రలు ఎంచుకునే నయనతార.. ఇప్పుడు సడెట్ను ఇలా స్మోక్ చేస్తూ కనిపించడం నెట్టింట చర్చనీయాంశమైంది. స్క్రిప్ట్ డిమాండ్ చేయడం వల్ల స్మోక్ సీన్ చేసిందా? లేదంటే నయనతారనే ఎలాంటి హద్దులు పెట్టుకోకూడదని నిర్ణయించుకుందా అని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక సాధారణంగా గ్యాంగ్‌స్టర్ సినిమాలు అంటే ముంబై అండర్ వరల్డ్, లేదంటే అంతర్జాతీయ మాఫియా చుట్టూ తిరుగుతుంటాయి. కానీ టాక్సిక్ సినిమా కోసం గోవా చరిత్రలోని ఒక క్లిష్ట సమయం కాన్సెప్ట్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తుంది. మన దేశానికి 1947లోనే స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, గోవా మాత్రం 1961 వరకు పోర్చుగీస్ పాలనలోనే ఉంది. ఆ 14 ఏళ్ల కాలంలో గోవాలో స్మగ్లింగ్ ముఠాలు ఎలా రాజ్యమేలాయి? రాజకీయ పరిస్థితులు ఎలా మారాయి? అనే అంశాల చుట్టూ ఈ ఫిక్షనల్ డ్రామా సాగుతున్నట్లు తెలుస్తుంది. ఈ కథ 1940లో మొదలై 1970 వరకు.. అంటే దాదాపు మూడు దశాబ్దాల పాటు సాగుతుంది. ఒక సామ్రాజ్యం పుట్టుక, దాని పతనం ఎలా జరిగిందో ఇందులో కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నారట.
ఈ సినిమాలో యష్ ‘రయా’ అనే పవర్ రోల్లో నటిస్తున్నాడు. మొత్తానికి ఆ మధ్య రిలీజ్ చేసిన గ్లింప్స్ నుంచి.. టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇలా ప్రతీది సినిమాపై అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ పోతున్నాయి. ఈ సినిమాలో ఏకంగా ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. గంగా రోల్లో నయతార నటిస్తుండగా.. నదియగా కియారా అద్వానీ, మెలిసా పాత్రలో రుక్మిణీ వసంత్, ఎలిజిబిత్గా హ్యూమా ఖురేషీ, రెబెకాగా తారా సుతారియా నటిస్తున్నారు.
ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను దిల్ రాజు దక్కించుకున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఏకంగా రూ.120 కోట్లతో రైట్స్‌ను దక్కించుకున్నట్లు తెలుస్తుంది. నిజానికి ఇది చాలా ఎక్కువ. స్టార్ హీరోల సినిమాల రేంజ్లో ఈ సినిమా బిజినెస్ జరిగింది. ఈ సినిమాకు ప్రస్తుతం మంచి బజ్ ఉంది కానీ.. మరీ ఒక కన్నడ సినిమా డబ్బింగ్ రైట్స్ ఇన్ని కోట్లకు కొన్నారంటే రిస్క్ అనే చెప్పాలి. మరి ఇందులో నిజమెంతుందో మాత్రం తెలియదు.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














