Nepal: నేపాల్ విలయం మిగిల్చిన విషాదం.. 1,344కు చేరిన మృతుల సంఖ్య.. 275 మంది భారతీయులు మిస్సింగ్! | | ACTPnews

News18


Last Updated:

నేపాల్‌ను ముంచెత్తిన భయంకరమైన వరదల్లో ఇప్పటివరకు 1,344 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విపత్తులో 275 మంది భారతీయులు గల్లంతు కాగా, సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బాధిత ప్రాంతాల్లో కలుషిత నీటితో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉంది.

News18
News18

గత వారం నేపాల్‌లో సంభవించిన భయంకరమైన వరదలు దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఆగస్టు 26న హిమాలయాల్లో హిమానీనదం అకస్మాత్తుగా కరగడం వల్ల లోయ వెంబడి పెద్ద పెద్ద సరస్సులు ఏర్పడి, టిబెట్ సరిహద్దులోని పలు గ్రామాల మీదుగా వరద ఉధృతంగా పోటెత్తింది. ఈ ఊహించని ప్రకృతి విపత్తులో మృతుల సంఖ్య ఏకంగా 1,344కు చేరిందని నేపాల్ పోలీసులు అధికారికంగా వెల్లడించారు. ఇళ్లన్నీ పూర్తిగా ధ్వంసం కావడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రజల రోజువారీ జీవితం పూర్తిగా స్తంభించిపోయింది. వరద బాధిత ప్రాంతాల్లో త్రాగునీరు కలుషితం కావడంతో అంటువ్యాధులు ప్రబలుతాయనే భయం స్థానికులను తీవ్రంగా కలవరపెడుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports