Last Updated:
ఆగస్టు 26న నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో 626 మంది ప్రాణాలు కోల్పోగా.. ఈ కష్టకాలంలో తమకు అండగా నిలిచిన భారత్కు నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీ ఔదార్యాన్ని ఆయన ప్రత్యేకంగా కొనియాడారు.
ఆగస్టు 26న నేపాల్లో సంభవించిన భయంకరమైన ఆకస్మిక వరదలు ఆ దేశాన్ని తీవ్రంగా కుదిపేశాయి. ఈ పెను విపత్తులో ఏకంగా 626 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కష్టకాలంలో తమకు బాసటగా నిలిచిన భారత ప్రభుత్వానికి, ప్రజలకు నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ శనివారం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఆపత్కాలంలో విశేషంగా స్పందించి తమ దేశానికి అండగా నిలిచిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ఉదార స్వభావం కలిగిన వారని ఆయన ప్రశంసించారు.














