Last Updated:
అక్కినేని సుమంత్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సరికొత్త పవర్ఫుల్ డివైన్ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
టాలీవుడ్లో ఇప్పుడు డివైన్, మిస్టిక్ థ్రిల్లర్స్ ట్రెండ్ నడుస్తోంది. ‘కార్తికేయ 2’, ‘విరూపాక్ష’, ‘హనుమాన్’ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. సరిగ్గా ఇదే కోవలో, అక్కినేని సుమంత్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సరికొత్త పవర్ఫుల్ డివైన్ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ తాజాగా యూట్యూబ్లో విడుదలై నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. విడుదలైన కొద్ది గంటల్లోనే రికార్డు స్థాయిలో వ్యూస్ రాబడుతూ, ట్రెండింగ్లో నిలిచింది. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన ఈ స్పిరిచువల్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద మరో హిట్ నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.














