Last Updated:
నితీష్ మాట్లాడుతున్న సమయంలో అతని మొబైల్ ఫోన్ ఒక్కసారిగా రింగ్ అయ్యింది. స్క్రీన్‌పై ‘అమ్మ’ అని చూడగానే అతని ముఖంలో చిన్న నవ్వు విరిసింది.
Nitish Kumar Reddy: అఫ్గానిస్తాన్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం సాధించిన తర్వాత మైదానం వెలుపల ఒక అద్భుతమైన సన్నివేశం చోటుచేసుకుంది. భారత యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో విలేకరులతో మాట్లాడుతుండగా.. మధ్యలో అతని తల్లి నుండి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అతను విలేకరులకు క్షమాపణలు చెబుతూ ప్రెస్‌మీట్‌ను మధ్యలోనే ఆపి ఫోన్ ఎత్తడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ధర్మశాలలోని హెచ్‌పీసీఏ (HPCA) స్టేడియంలో వర్షం కారణంగా ఇరు జట్లకు 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్‌లో అద్భుతంగా రాణించి 4 ఓవర్లలో 31 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా భారత బౌలర్లను ఆటాడేసుకుంటూ కేవలం 51 బంతుల్లోనే 102 పరుగులు చేసిన ఆఫ్ఘన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్‌తో పాటు సీనియర్ ప్లేయర్ మహ్మద్ నబీ వికెట్లను నితీష్ ఖాతాలోనే వేసుకున్నాడు. ఈ అద్భుత ప్రదర్శనతో మ్యాచ్ అనంతరం మీడియా ముందుకు వచ్చిన నితీష్, జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు సమాధానమిస్తున్నాడు.
నితీష్ మాట్లాడుతున్న సమయంలో అతని మొబైల్ ఫోన్ ఒక్కసారిగా రింగ్ అయ్యింది. స్క్రీన్‌పై ‘అమ్మ’ అని చూడగానే అతని ముఖంలో చిన్న నవ్వు విరిసింది. వెంటనే జర్నలిస్టుల వైపు చూస్తూ.. “సారీ, నేను ఈ ఫోన్ లిఫ్ట్ చేయాలి” (Sorry, I have to pick this) అంటూ చాలా వినయంగా క్షమాపణలు చెప్పాడు.
ఆ తర్వాత ఫోన్ ఎత్తి.. “అమ్మా నేను మళ్ళీ చేస్తాను, ఫైవ్ మినిట్స్” అని తెలుగులో చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఈ సరదా సన్నివేశంతో ప్రెస్‌మీట్ హాల్‌లో ఉన్నవారంతా ఒక్కసారిగా నవ్వేశారు.
CUTEST VIDEO OF THE DAY 🥹❤️
– Nitish Kumar Reddy was attending the press conference and then he got a call from his mother. pic.twitter.com/ywEoVid3eD
— Johns. (@CricCrazyJohns) June 13, 2026
ఈ క్యూట్ మూమెంట్‌కు సంబంధించిన వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది. దీనికి “పోస్ట్-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ కాసేపు ఆగవచ్చు, కానీ అమ్మ ఫోన్ కాల్ అస్సలు ఆగకూడదు” అంటూ పెట్టిన క్యాప్షన్ క్రికెట్ ఫ్యాన్స్ హృదయాలను గెలుచుకుంది.
అంతర్జాతీయ స్థాయిలో ఇంతటి విజయం అందుకున్నప్పటికీ, నితీష్ తన మూలాలను మర్చిపోకుండా అంత వినయంగా ఉండటంపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది. భారత అరంగేట్ర బౌలర్లు గుర్నూర్ బ్రార్ (3/27), హర్ష్ దూబే (3/47) అద్భుతంగా రాణించారు. అనంతరం 195 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో 13 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 66 బంతుల్లో 84 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana













