Last Updated:
రీమేక్‌లతో అలసిపోయిన పవన్ ఫ్యాన్స్‌కు హరిహర వీరమల్లు కాస్త ఊరటనిస్తుందనుకుంటే.. అది ఇంకా బాధ పెట్టింది. గతేడాది జులైలో రిలీజైన ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు నిద్రలేని రాత్రులను మిగిల్చింది.
రీమేక్‌లతో అలసిపోయిన పవన్ ఫ్యాన్స్‌కు హరిహర వీరమల్లు కాస్త ఊరటనిస్తుందనుకుంటే.. అది ఇంకా బాధ పెట్టింది. గతేడాది జులైలో రిలీజైన ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు నిద్రలేని రాత్రులను మిగిల్చింది. అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సైతం క్లైమాక్స్ వరకు చూడలేకపోయారంటే ఎంత ఘోరమైన సినిమానో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే.. ఈ బాధ ఎన్నో నెలలు లేదు. కేవలం రెండు నెలల గ్యాప్‌లోనే ఓజీతో రికార్డులు తిరగరాశాడు పవర్ స్టార్. ఆయన ఫ్యాన్స్‌కు మాములు మెమోరబుల్ మూమెంట్స్ ఇవ్వలేదు.
గతేడాది సెప్టెంబర్ 25న భారీ అంచనాల మధ్య రిలీజైన ఓజీ సినిమా అంచనాలకు మించి హిట్టయింది. నిజానికి ప్రీమియర్ షో నుంచే ఈ సినిమా ఫుల్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా చాలా సీన్లు ఫ్యాన్స్‌కు మాస్ స్టఫ్‌ను ఇచ్చాయని సంబురాల్లో మునిగిపోయారు. కట్ చేస్తే, తొలి రోజు అక్షరాల రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రికార్డులు క్రియేట్ చేసింది. ఫైనల్ రన్లో రూ.300 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు సాధించి హిట్టుగా నిలిచింది.
నిజానికి ఈ సినిమాకొచ్చిన టాక్‌కు రూ.500 కోట్లు ఈజీగా కొట్టేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ సినిమా రూ.300 కోట్ల దగ్గరే ఆగిపోయింది. ఇక ఆ తర్వాత ఓటీటీలో రిలీజై అక్కడ కూడా మంచి వ్యూస్‌ను రాబట్టింది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్‌కు రెడీ అయిపోయింది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను ఈటీవీ దక్కించుకుంది. కాగా.. త్వరలోనే ఈ సినిమాను టెలికాస్ట్ చేస్తాం అని ఈటీవీ సంస్థ తెలిపింది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటించింది. విలన్‌గా ఇమ్రాన్ హష్మీ నటించగా.. కీలక పాత్రల్లో అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్‌లు నటించారు.
సినిమా కథ విషయానికొస్తే… ఓజాస్ గంభీర అలియాస్ పవన్ కళ్యాణ్ జపాన్‌లో జరిగిన ఓ దాడి నుంచి తప్పించుకుని షిప్లో ఇండియాకు బయలుదేరుతాడు. ఆ ప్రయాణంలో సత్యదాదా అలియాస్ ప్రకాశ్ రాజ్‌ను ప్రాణాపాయం నుంచి రక్షిస్తాడు. దీంతో సత్యదాదా ఓజీని తనతో ముంబైకి తీసుకెళ్లడం.. అక్కడ అండర్వర్ల్డ్ డాన్‌గా ఎదిగే సత్యదాదాకి ఓజీ కుడిభుజం కావడం జరుగుతుంది. హార్బర్‌నే బేస్‌గా చేసుకుని సత్యదాదా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటాడు. సత్యదాదాకి ఇద్దరు కొడుకులు ఉన్నా, ఓజీని మూడో కొడుకులా భావిస్తుంటాడు. అయితే అనుకోని సంఘటనల కారణంగా ఓజీ ఆ కుటుంబం నుంచి దూరమై అజ్ఞాతంలోకి వెళ్తాడు. అక్కడ డాక్టర్ కన్మణి అలియాస్ ప్రియాంక అరుళ్ మోహన్)ని పెళ్లి చేసుకుంటాడు.
ఓజీ ముంబై వదిలి వెళ్లిన తర్వాత, సత్యదాదా పాత స్నేహితుడు మిరాజ్కర్ (తేజ్ సప్రూ) కొడుకులు జిమ్మీ (సుదేవ్ నాయర్), ఓమీ (ఇమ్రాన్ హష్మీ) అండర్వర్ల్డ్పై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తారు. ఈ సమయంలో కొడుకులను కోల్పోయిన సత్యదాదాకి మళ్లీ ఓజీ అవసరం అవుతుంది. మరి ఓజీ తిరిగి ముంబైకి వచ్చాడా? మిరాజ్కర్ కొడుకులకు ఏం చేశాడు? అతను ఎందుకు అజ్ఞాతం పాలయ్యాడు? చేయని తప్పుకి తనను తానే ఎందుకు శిక్షించుకున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానం సినిమా మిగతా కథలో ఉంటుంది.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














