OYO Hotel Room: హైదరాబాద్ ఓయో రూమ్‌లో ఇల్లీగల్ దందా.. జీతం సరిపోక తప్పుడు మార్గంలో యువత | తెలంగాణ వార్తలు | ACTPnews

OYO Hotel Room


Last Updated:

OYO Hotel Room: హైదరాబాద్ మహానగరంలో ఓయో గదులు నిషేధిత మాదక ద్రవ్యాల వ్యాపారానికి అడ్డాగా మారిపోయాయి. ఇప్పటి వరకు ప్రేమజంటలు, రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్లతో పాటు చాటుమాటుగా వ్యభిచారం కూడా జరుగుతోందని విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు ఈజీ మనీ కోసం యువత ఇల్లీగల్ దందాలకు పాల్పడుతోంది.

OYO Hotel Room
OYO Hotel Room

OYO Hotel Room: హైదరాబాద్ మహానగరంలో ఓయో గదులు నిషేధిత మాదక ద్రవ్యాల వ్యాపారానికి అడ్డాగా మారిపోయాయి. ఇప్పటి వరకు ప్రేమజంటలు, రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్లతో పాటు చాటుమాటుగా వ్యభిచారం కూడా జరుగుతోందని విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు తాజాగా పెద్ద మొత్తంలో గంజాయిని సప్లై చేస్తున్న ఇద్దరు యువకుల్ని ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరు గంజాయి ముఠా సభ్యులు అస్సాం నుంచి గంజాయిని హైదరాబాద్‌కి తెచ్చి విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. నిందితుల దగ్గర నుంచి సుమారు 17.1 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్ ప్రకారం దీని విలువ సుమారు రూ.9 లక్షలు ఉంటుందని పోలీసులు తేల్చారు. నిందితులు అస్సాంకు చెందిన ధీరజ్ దాస్, రబాలి అలీగా గుర్తించి కేసు నమోదు చేశారు.

ఓయో రూమ్‌లో ఇల్లీగల్ దందా..

హైటెక్ లైఫ్ స్టైల్, పాష్ కల్చర్ , మెట్రోపాలిటన్ సిటీగా మారిన హైదరాబాద్ ఇప్పుడు అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. కొండాపూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని ఓయో హైలెట్స్ హోటల్‌ కేంద్రంగా ఇద్దరు యువకులు నిషేదిక మాదకద్రవ్యాలు గంజాయి విక్రయాలు నిర్వహిస్తున్నట్లుగా ఎస్ఓటీ పోలీసులు గుర్తించారు. గుట్టుచప్పుడు కాకుండా ఐటీ ఉద్యోగులు, యువతను టార్గెట్ చేసుకొని అస్సాం నుంచి గంజాయిని హైదరాబాద్‌కి తెచ్చి విక్రయిస్తున్నారు ధీరజ్ దాస్, రబాలి అలీ అనే ఇద్దరు యువకులు. పోలీసులకు వచ్చిన పక్కా సమాచారంతో ఓయో హైలెట్స్ హోటల్‌పై రైడ్ చేసి రూ.9 లక్షల విలువైన గంజాయి పట్టుకున్నారు. గంజాయి బిజినెస్‌ చేస్తున్న ఇద్దరు అస్సాం యువకుల్ని అరెస్ట్ చేశారు.

ఇద్దరు అరెస్ట్..

నిందితులు పెద్ద మొత్తంలో అస్సాం నుంచి గంజాయిని తీసుకొచ్చి ఇక్కడ ఓయో రూమ్‌లో చిన్న ప్యాకెట్స్‌గా మార్చి విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. ఇద్దరి దగ్గర నుంచి 17.1 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.9 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇద్దరు గంజాయి పెడ్లర్స్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి విచారించడంతో నిజం ఒప్పుకున్నారు. గతంలో హైదరాబాద్‌లో సెక్యూరిటీ గార్డులుగా పనిచేసినట్లుగా తెలుస్తోంది. సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తే వచ్చే జీతం సరిపోక ఈజీ మనీ కోసం గంజాయి విక్రయాల వైపు మళ్లినట్లు ఎక్సైజ్ విచారణలో వెల్లడైంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed