Padma Awards 2026: రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. తొలి విడతలో 66 మందికి పురస్కారాలు | | ACTPnews

దివంగత భర్త ధర్మేంద్ర తరఫున పద్మ విభూషన్ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరిస్తున్న భార్య హేమమాలిని


Last Updated:

రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా ముగిశాయి. 2026కు గానూ 131 మందిని పద్మ అవార్డులు వరించగా.. తొలి విడతలో భాగంగా మే 25న 66 మందికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొన్నారు.

దివంగత భర్త ధర్మేంద్ర తరఫున పద్మ విభూషన్ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరిస్తున్న భార్య హేమమాలిని
దివంగత భర్త ధర్మేంద్ర తరఫున పద్మ విభూషన్ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరిస్తున్న భార్య హేమమాలిని

Padma Awards: దేశ రాజధాని దిల్లీలోని రాష్ట్రపతి భవన్ ‘గణతంత్ర మండపం’లో సోమవారం (మే 25, 2026) పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. 2026 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మొత్తం 131 పద్మ అవార్డులలో.. తొలి విడతగా 66 మంది గ్రహీతలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అత్యున్నత పౌర పురస్కారాలను అందజేశారు. ఈ ప్రతిష్టాత్మక సివిల్ ఇన్వెస్టిచర్ వేడుకలో ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు పాల్గొన్నారు. నేటి వేడుకలో రాష్ట్రపతి 2 పద్మ విభూషణ్, 6 పద్మ భూషణ్, 58 పద్మ శ్రీ అవార్డులను ప్రదానం చేశారు.

పద్మ విభూషణ్ (మరణానంతరం): బాలీవుడ్ దిగ్గజ నటుడు, దివంగత ధర్మేంద్ర తరఫున ఆయన సతీమణి, ఎంపీ హేమమాలిని రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ విభూషణ్ పురస్కారాన్ని స్వీకరించారు.

పద్మ భూషణ్: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ అల్కా యాగ్నిక్ లు కళా రంగానికి చేసిన విశేష సేవలకు గాను ఈ రోజు పద్మ భూషణ్ అవార్డులను అందుకున్నారు.

ఈ సందర్భంగా తెలంగాణకు చెందిన ముగ్గురు ప్రముఖులు ఈ పురస్కారాలను అందుకోవడం విశేషం. వైద్య రంగంలో విశిష్ట సేవలందించిన ప్రముఖ వైద్యుడు జి.వెంకట్రావుకు, క్యాన్సర్‌ వైద్య సేవల్లో విశేష కృషి చేసిన డాక్టర్ పి.విజయ్ ఆనంద్ రెడ్డికి పద్మ గౌరవం లభించింది. అలాగే కూచిపూడి నృత్యకారిణి దీపికా రెడ్డికి పద్మ అవార్డు దక్కింది. అవార్డు గ్రహీతలను రాష్ట్రపతి అభినందిస్తూ.. దేశాభివృద్ధికి వివిధ రంగాల్లో వారు అందించిన సేవలు భావితరాలకు ఆదర్శమని పేర్కొన్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed