PAK vs AFG War: ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్తాన్ వైమానిక దాడులు.. 19కి చేరిన మృతుల సంఖ్య.. 11 మంది చిన్నపిల్లలే! | | ACTPnews

అఫ్గానిస్తాన్‌పై పాక్ దాడి


Last Updated:

ఈ ఘోర దాడిలో ఒక మహిళతో పాటు ఎనిమిది మంది చిన్నారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది 7 నుండి 10 ఏళ్ల వయసున్న చిన్నపిల్లలే ఉన్నట్లు స్థానిక వనరులు ధృవీకరించాయి.

అఫ్గానిస్తాన్‌పై పాక్ దాడి
అఫ్గానిస్తాన్‌పై పాక్ దాడి

PAK vs AFG War: ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాలపై పాకిస్తాన్ సైన్యం జరిపిన వైమానిక దాడులు (Air Strikes) రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లోని ఖోస్ట్ (Khost) ప్రాంతంలో జరిగిన ఈ దాడుల్లో మరణించిన వారి సంఖ్య 19కి చేరినట్లు ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ ‘టోలో న్యూస్’ (TOLO News) వెల్లడించింది. ఖోస్ట్ ప్రాంతంలోని స్పెరా జిల్లా మనయ్ గ్రామాన్ని లక్ష్యంగా చేసుకుని పాక్ యుద్ధవిమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ ఘోర దాడిలో ఒక మహిళతో పాటు ఎనిమిది మంది చిన్నారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది 7 నుండి 10 ఏళ్ల వయసున్న చిన్నపిల్లలే ఉన్నట్లు స్థానిక వనరులు ధృవీకరించాయి.

ఇది మానవీయ నేరం: తాలిబాన్ ఆగ్రహం

ఈ దాడులపై ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వ ప్రధాన ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ (Zabihullah Mujahid) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ ద్వారా తీవ్రంగా స్పందించారు. పాకిస్తాన్ వైమానిక దాడులు కేవలం ఖోస్ట్‌కే పరిమితం కాలేదని.. కునార్, పక్తికా ప్రాంతాల్లోనూ జరిగాయని ఆయన పేర్కొన్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఈ దాడుల్లో 11 మంది చిన్నారులు, ఒక మహిళ, ఒక వృద్ధుడు సహా కనీసం 13 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని ముజాహిద్ తెలిపారు. పాకిస్తాన్ చేసిన ఈ చర్యను “మానవతా నేరం మరియు తీవ్రమైన దురాక్రమణ” గా ఆయన అభివర్ణించారు.

అంతర్జాతీయ వార్తా సంస్థ ‘ఏఎఫ్‌పీ’ (AFP) కథనం ప్రకారం.. ఖోస్ట్ జిల్లాలోని స్పెరాలో ఒక సాధారణ పౌరుడి ఇంటిపై బాంబు పడటంతో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది చనిపోగా, 10 మంది గాయపడ్డారు. పొరుగున ఉన్న పక్తికా ప్రాంతంలోని బర్మల్ జిల్లాలో జరిగిన మరో దాడిలో ముగ్గురు పౌరులు చనిపోయారు. అయితే, ఈ వైమానిక దాడులపై పాకిస్తాన్ ప్రభుత్వం లేదా ఆ దేశ సైన్యం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన గానీ, ధృవీకరణ గానీ రాలేదు.

ఐరాస (UN Security Council) వేదికగా పాకిస్తాన్‌ను ఎండగట్టిన భారత్!

ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో పాకిస్తాన్ అరాచకాలపై భారతదేశం అంతర్జాతీయ వేదికపై గళమెత్తింది. ఆఫ్ఘనిస్తాన్‌లో పాకిస్తాన్ జరుపుతున్న వైమానిక దాడులు, వాటి వల్ల భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్న అమాయక పౌరుల (Civilian Casualties) అంశాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ తీవ్రంగా తప్పుపట్టింది.

ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి హరీష్ పర్వతనేని ఈ సరిహద్దు ఉద్రిక్తతలపై పాకిస్తాన్‌ను తీవ్రంగా నిలదీశారు. ఆఫ్ఘనిస్తాన్‌ భూభాగంలోకి చొరబడి పాకిస్తాన్ జరుపుతున్న సరిహద్దు హింస (Cross-Border Violence) వల్లే వందలాది మంది అమాయక అఫ్ఘన్ పౌరులు చనిపోతున్నారని మరియు గాయపడుతున్నారని ఆయన ఆరోపించారు. ఐరాస నివేదిక ప్రకారం.. కేవలం ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే ఈ సరిహద్దు ఘర్షణల వల్ల 372 మంది ఆఫ్ఘన్ పౌరులు మరణించగా, 397 మంది గాయపడ్డారు. తాజా పరిణామాలతో అఫ్ఘన్-పాక్ సరిహద్దులో భద్రతా పరిస్థితి మరింత దిగజారుతోందని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.

అగాధంలోకి అఫ్ఘన్ – పాక్ సంబంధాలు

2021లో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇరు దేశాల మధ్య సంబంధాలు బొత్తిగా క్షీణించాయి. పాకిస్తాన్‌లో వరుస ఉగ్రదాడులకు పాల్పడుతున్న ‘తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్’ (TTP) ముఠాకు ఆఫ్ఘనిస్తాన్ ఆశ్రయం ఇస్తోందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇస్లామాబాద్ పదే పదే కోరుతోంది. అయితే, ఈ ఆరోపణలను తాలిబాన్ తోసిపుచ్చింది. పైగా, ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా పనిచేసే శక్తులకు పాకిస్తానే స్వయంగా మద్దతు ఇస్తోందని తిరుగుబాణాన్ని ఎక్కుపెట్టింది.

గత అక్టోబర్ 2025లో కాబూల్ నగరంలో జరిగిన వరుస పేలుళ్ల తర్వాత ఈ ఇరు దేశాల వైరం మరింత ముదిరింది. తాజా వైమానిక దాడులు సద్దుమణుగుతున్న ఉద్రిక్తతలకు మళ్లీ ఆజ్యం పోశాయి. సరిహద్దు ఉగ్రవాదం, భద్రతా వైఫల్యాలపై ఇరు దేశాలు పరస్పరం నిందలు వేసుకుంటుండటంతో పసిఫిక్ ప్రాంతంలో సరిహద్దు యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports