Peddi Movie: ‘పెద్ది’ ట్రైలర్‌పై రామ్ చరణ్ సాలిడ్ అప్‌డేట్.. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా ప్రతిష్టాత్మక చిత్రం “పెద్ది”. క్రీడా నేపథ్యంతో సాగే ఈ పక్కా రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.

News18
News18

ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా ప్రతిష్టాత్మక చిత్రం “పెద్ది”. క్రీడా నేపథ్యంతో సాగే ఈ పక్కా రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా తన తొలి సినిమా ‘ఉప్పెన’తో జాతీయ అవార్డు సాధించిన తర్వాత చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఇండస్ట్రీ వర్గాల్లో దీనిపై విపరీతమైన ఆసక్తి నెలకొంది. సుకుమార్ మార్క్ టేకింగ్, బుచ్చిబాబు విజన్ కలగలిపి చరణ్‌ను ఒక సరికొత్త ఊరమాస్ అవతారంలో చూపించబోతున్నారు.

శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ ఈ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత చేరువ కాబోతోంది. రామ్ చరణ్ సరసన పల్లెటూరి యువతి పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరు అద్భుతంగా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. వారిద్దరి కెమిస్ట్రీ, ఎమోషనల్ సీన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయిన వీరిద్దరి ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకుల్లో అమాంతం అంచనాలను పెంచేశాయి.

సినిమా విడుదల సమయం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ల వేగాన్ని మేకర్స్ తారాస్థాయికి చేర్చారు. ఫస్ట్ లుక్ పోస్టర్లు, మేకింగ్ వీడియోలు, గ్లింప్స్ వీడియోలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. వీటన్నింటినీ మించి ఇప్పుడు అందరి దృష్టి థియేట్రికల్ ట్రైలర్ పైన పడింది. ఈ నిరీక్షణకు తెరదించుతూ మేకర్స్ ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. రేపు ముంబై మహా నగరంలో ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను అత్యంత భారీ స్థాయిలో నిర్వహించబోతున్నారు.

రామ్ చరణ్ నార్త్ ఇండియా ఫాలోయింగ్‌ను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఈవెంట్ గురించి రామ్ చరణ్ స్వయంగా ఒక ప్రత్యేక వీడియో బైట్ ద్వారా అభిమానులకు వివరించారు. “ఇప్పటిదాకా మీరు చూసిన పాటలు, గ్లింప్స్ కేవలం శాంపిల్ మాత్రమే.. రేపు రాబోయే పెద్ది ట్రైలర్ బ్లాస్ట్ మరో ఎత్తులో ఉంటుంది” అంటూ ఆయన చెప్పిన మాటలు అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. ముంబైలోని ప్రసిద్ధ ‘జియో వరల్డ్ డ్రైవ్’ ప్రాంగణంలో ఈ వేడుకను అంగరంగ వైభవంగా ప్లాన్ చేశారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఈ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభం కానుంది. బాలీవుడ్ మీడియా ప్రతినిధులు, భారీ సంఖ్యలో అభిమానుల సమక్షంలో ఈ లాంచ్ జరగనుంది.

ఈ సినిమాకి మరో ప్రధాన బలం ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ అందించిన సంగీతం. స్పోర్ట్స్ డ్రామాకు కావాల్సిన ఉద్వేగాన్ని తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో రెహమాన్ నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తారని అభిమానులు ప్రగాఢంగా నమ్ముతున్నారు. వృద్ధి సినిమాస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించింది. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా, ప్రతి ఫ్రేమ్‌లో క్వాలిటీ కనిపించేలా మేకర్స్ జాగ్రత్తలు తీసుకున్నారు.

అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసుకున్న ఈ మెగా ప్రాజెక్ట్ జూన్ 4న పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలోకి రాబోతోంది. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడానికి రామ్ చరణ్ సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో రేపు రాబోయే ట్రైలర్ సినిమా హైప్‌ను ఇంకెంత పెంచుతుందో చూడాలి. టాలీవుడ్ సహా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర జూన్ 4న ఒక పెద్ద ప్రభంజనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports