PM Modi: భారత రాజకీయాల్లో మోదీ సరికొత్త చరిత్ర.. ప్రపంచ దేశాల అధినేతల అభినందనలు | | ACTPnews

News18


Last Updated:

భారతదేశంలో అత్యధిక రోజులు నిరంతరాయంగా ప్రధానిగా పనిచేసిన ప్రజాస్వామ్య నేతగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు. 4,399 రోజులు పూర్తి చేసుకున్న మోదీకి ప్రపంచ దేశాల అగ్రనేతలు ఘనంగా అభినందనలు తెలిపారు.

News18
News18

భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 4,399 రోజులు పూర్తి చేసుకుని, దేశ చరిత్రలోనే అత్యధిక కాలం నిరంతరాయంగా సేవలు అందించిన ప్రజాస్వామ్య పాలకుడిగా చారిత్రాత్మక మైలురాయిని అధిగమించారు. తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న 4,398 రోజుల రికార్డును దాటేసిన ఈ అరుదైన సందర్భంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అగ్రనేతలు, దౌత్యవేత్తలు ప్రధాని మోదీకి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. మోదీ హయాంలో సాగిన విప్లవాత్మక పరిపాలన, అంతర్జాతీయ వేదికలపై గ్లోబల్ సౌత్ దేశాల తరఫున ఆయన వినిపిస్తున్న బలమైన గళం, ఆర్థికంగా ఎదుగుతున్న భారతదేశ పురోగతిని ప్రపంచ నాయకులు ప్రత్యేకంగా కొనియాడారు. మోదీపై వారేమన్నారంటే..

ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని

భారతదేశ చరిత్రలో సుదీర్ఘకాలం నిరంతరాయంగా పాలించిన ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించడంపై ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని ఎక్స్ వేదికగా ఘనంగా అభినందనలు తెలిపారు. ఈ అరుదైన మైలురాయి మోదీ దీర్ఘకాలిక రాజకీయ నాయకత్వానికి, భారత ప్రజాస్వామ్యంపై ప్రజలకు ఉన్న అచంచలమైన నమ్మకానికి నిదర్శనమని ఆమె కొనియాడారు.

ఇటీవల మోదీకి రోమ్‌లో స్వాగతం పలకడం సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొంటూ, భారత్-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యం ఇరు దేశాల ప్రజల భవిష్యత్తుకు సరికొత్త అవకాశాలను సృష్టిస్తుందని ఆకాంక్షించారు. రాబోయే కాలంలో రెండు దేశాల మధ్య పరస్పర సహకారం, స్నేహ బంధం మరింత బలోపేతం అవుతుందని మెలోని ఆశాభావం వ్యక్తం చేశారు.

శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే ప్రధాని మోదీకి ప్రత్యేక లేఖ రాస్తూ అభినందనలు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ ప్రజలు మోదీ నాయకత్వంపై పదే పదే ఉంచిన నమ్మకానికి ఈ మైలురాయి ఒక నిదర్శనమని పేర్కొన్నారు. భారతదేశంలో జరుగుతున్న ఆర్థిక, సామాజిక మార్పులు శ్రీలంకతో పాటు సరిహద్దులు దాటి మరెన్నో దేశాలకు స్ఫూర్తినిస్తున్నాయని కొనియాడారు. 2022లో శ్రీలంక ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభ సమయంలో భారతదేశం అందించిన నిరంతర మద్దతును ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలతో గుర్తుచేసుకున్నారు.

మాల్దీవ్స్ అధ్యక్షుడు ఇలా..

పాపువా న్యూగినియా ప్రధానమంత్రి జేమ్స్ మరాపే ఒక ప్రత్యేక వీడియో సందేశం ద్వారా ప్రధాని మోదీని అభినందించారు. మోదీ ప్రపంచ దేశాలకు ఒక రోల్ మోడల్ అని, నాయకత్వానికి ఆదర్శప్రాయుడని కొనియాడారు. భారతదేశంలో దాదాపు 20 కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలను పేదరికం నుండి విముక్తులను చేసి, వారికి మెరుగైన జీవితాన్ని అందించడం ఒక అసాధారణమైన విజయమని ప్రశంసించారు. గ్లోబల్ సౌత్ దేశాల అభ్యున్నతికి మోదీ చేస్తున్న కృషిని అభినందిస్తూ, తమ దేశంతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఆకాంక్షించారు.

ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిస్సేసర్ ప్రధాని మోదీ అరుదైన మైలురాయిపై స్పందిస్తూ, మోదీ నాయకత్వంలో అంతర్జాతీయ విషయాలపై భారతదేశం ఒక బలమైన గళంగా ఎదిగిందని అన్నారు. ఒక సామాన్య కుటుంబం నుండి ఎదిగి, మూడు విడతలుగా 140 కోట్ల మంది ప్రజలకు నాయకత్వం వహిస్తున్న మోదీ ప్రస్థానం అద్భుతమని కొనియాడారు. విదేశాంగ విధానం, మౌలిక వసతుల కల్పన, ఆర్థిక వృద్ధి రంగాలలో భారతదేశం సాధించిన విజయాలను ఆమె ప్రత్యేకంగా ప్రశంసించారు. అటు మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని స్కాట్ మోరిసన్, అమెరికా సెనేటర్లు సైతం మోదీ పన్నెండేళ్ల పరిపాలనను విప్లవాత్మకమైనదిగా అభివర్ణించారు.

అమెరికా రాయబారి సెర్గియో గోర్ మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. మోదీ సాధించిన ఈ అరుదైన మైలురాయి ఆయన దశాబ్దాల నిరంతర ప్రజాసేవకు, అసాధారణ నాయకత్వానికి దక్కిన గొప్ప నిదర్శనమని గోర్ కొనియాడారు. అంతర్జాతీయంగా దౌత్యవేత్తలు, దేశాల అధినేతల నుండి వస్తున్న ఈ అభినందనలు ప్రపంచ వేదికపై మారుతున్న భారతదేశ గ్లోబల్ స్థానాన్ని, మోదీ విదేశాంగ విధాన విజయాలను స్పష్టం చేస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. తీవ్రమైన రాజకీయ పోటీ ఉన్న ఆధునిక కాలంలో ప్రజావిశ్వాసం పొందుతూ సాగుతున్న ఈ ప్రస్థానం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *