PM Modi Selfie Video on NEET paper leak: అర్ధరాత్రి మోదీ సెల్ఫీ వీడియో.. నీట్ లీకేజీపై కేబినెట్ భేటీలో కఠిన నిర్ణయాలు.. | | ACTPnews

Prime Minister Narendra Modi | File image credit: PTI


Last Updated:

PM Modi Selfie Video: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు

Prime Minister Narendra Modi | File image credit: PTI
Prime Minister Narendra Modi | File image credit: PTI

PM Modi Selfie Video: దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ఘటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక సెల్ఫీ వీడియో ద్వారా స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తోంది. ఇది కేవలం ఒక సాధారణ సమస్య కాదని, లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆశలతో ముడిపడి ఉన్న సున్నితమైన అంశమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో లీకేజీలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా కొత్త నిబంధనలపై కేబినెట్ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు.దేశంలో ప్రతిభావంతులైన యువత భవిష్యత్తును కాపాడటమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని ప్రధాని తెలిపారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని హెచ్చరించారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో కీలక సూత్రధారులను అరెస్టు చేసి జైలుకు పంపినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు పునరావృతం కాకుండా ఉండేందుకు దేశంలో పరీక్షల నిర్వహణ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు.

లీకేజీ కేసుల విచారణ ఆలస్యం కాకుండా, నేరస్థులకు వేగంగా శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. విద్యార్థుల విద్యా సంవత్సరం వృథా కాకుండా చూస్తూనే, వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు సమగ్రమైన చట్టపరమైన, పరిపాలనాపరమైన మార్పులు తీసుకరావడమే ఈ కేబినెట్ సమావేశం ముఖ్య ఉద్దేశం.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *