PM Modi: ప్రధాని మోదీకి ఉజ్బెకిస్తాన్ అత్యున్నత పురస్కారం.. యురేనియం సరఫరాపై కీలక ఒప్పందం! | | ACTPnews

News18


Last Updated:

ఉజ్బెకిస్తాన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ఓలి దారాజలీ దుస్త్‌లిక్’ లభించింది. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా ఇరు దేశాలు యురేనియం సరఫరాతో పాటు పలు ఒప్పందాలు చేసుకున్నాయి.

News18
News18

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉజ్బెకిస్తాన్ దేశపు అత్యున్నత పౌర పురస్కారం వరించింది. సెంట్రల్ ఆసియా పర్యటనలో భాగంగా ప్రస్తుతం తాష్కెంట్‌లో ఉన్న ప్రధాని మోదీకి ఆదివారం నాడు ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవకత్ మిర్జియోయెవ్ స్వయంగా ‘ఆర్డర్ ఆఫ్ ఓలి దారాజలీ దుస్త్‌లిక్’ అవార్డును ప్రదానం చేశారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంతో పాటు ఆత్మీయ సంబంధాలను మరింత చేరువ చేయడంలో మోదీ చేసిన కృషికి గుర్తింపుగా ఈ అత్యున్నత గౌరవాన్ని అందించారు. ఈ పురస్కారం దక్కడం పట్ల ప్రధాని హర్షం వ్యక్తం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *