Last Updated:
సెప్టెంబరు 4న ఎస్వీ గోసంరక్షణశాలలో వైభవంగా గోకులాష్టమి వేడుకలు..!
తిరుపతిలోని టీటీడీ శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాల సెప్టెంబరు 4న గోకులంగా ముస్తాబుకానుంది. శ్రీకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని గోకులాష్టమి వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. గోపూజ, వేదపఠనం, భజనలు, కోలాటాలు, హరినామ సంకీర్తనలు, హరికథ వంటి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలతో రోజంతా గోసంరక్షణశాల భక్తి వాతావరణంతో కళకళలాడనుంది. సనాతన ధర్మంలో గోమాతకు ఉన్న ప్రాధాన్యాన్ని, గోసేవ విశిష్టతను భక్తులకు తెలియజేయడం ఈ వేడుకల ప్రధాన ఉద్దేశ్యంగా టీటీడీ పేర్కొంది.














