PM Modi: బుక్‌మైషోలో ప్రధాని మోదీ సభకు రికార్డు స్పందన.. గంటలోనే టికెట్లు ఖాళీ.. 42 వేల మంది వెయిటింగ్ లిస్ట్‌! | | ACTPnews

ప్రధాని మోదీ


Last Updated:

PM Modi: గుజరాత్‌లోని వడోదరలో మంగళవారం జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ సరికొత్త చరిత్ర సృష్టించింది.

ప్రధాని మోదీ
ప్రధాని మోదీ

దేశంలోనే తొలిసారిగా ఒక ప్రధాని సభలో ప్రజా భాగస్వామ్యం కోసం ప్రముఖ ఈవెంట్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ ‘బుక్‌మైషో’ (BookMyShow) ద్వారా ఉచిత రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించగా, కేవలం గంట వ్యవధిలోనే సీట్లన్నీ పూర్తిగా బుక్ అయిపోయాయి. సెప్టెంబర్ 8న జరిగే ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించడంతో దాదాపు 42,000 మందికి పైగా దరఖాస్తుదారులు వెయిటింగ్ లిస్ట్‌లో నిలిచినట్లు అధికారులు వెల్లడించారు. వడోదర నగరంలో రూ.35,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *