అయితే ఇప్పుడు ప్రీతిరెడ్డి వ్యాపారవేత్తగానే కాకుండా ఓ విద్యావంతురాలిగా చలామణి అవుతూ రాబోయే రోజుల్లో రాజకీయ నాయకురాలిగా మారాలని చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే పలు సందర్భాల్లో మోదీని, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పథకాలు, అభివృద్దిని మెచ్చుకుంటూ బీజేపీ జపం చేస్తూ వచ్చారు. అయితే మామ, అన్న ఇద్దరూ బీఆర్ఎస్‌లో ఉండటం, కాంగ్రెస్ పార్టీలో తమకు వ్యతిరేకిగా ఉన్న రేవంత్ రెడ్డి సీఎంగా ఉండటంతో ప్రీతిరెడ్డి బీజేపీలో చేరితే బెటర్ అని రాబోయే ఎన్నికల్లో మల్కాజ్‌గిరి లోక్ సభ నుంచి టికెట్ పొంది పోటీ చేసేందుకు పొలిటికల్‌గా గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లుగా కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.













