ఒక కార్యక్రమం సందర్భంగా కపిల్ దేవ్ మీడియాతో మాట్లాడుతూ.. “మనం ఎందుకు బాధపడాలి? ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. రోహిత్ శర్మ ఇన్నేళ్లుగా మనకు, దేశానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు ఎంతో వినోదాన్ని, సంతోషాన్ని అందించాడు. క్రికెట్‌లో ఎవరైనా ఒకరోజు తప్పుకోవాల్సిందే. గతంలో సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గజాలు కూడా రిటైర్ అయ్యారు. కాబట్టి రోహిత్ వీడ్కోలు పలికే సమయంలో అతని సుదీర్ఘ ప్రస్థానాన్ని మనం పండగలా జరుపుకోవాలి” అని వ్యాఖ్యానించారు.














