Last Updated:
జూన్ 2వ తేదీన హైదరాబాద్‌లోని శిల్పకళా వేదిక లేదా ఎల్బీ స్టేడియంలో అత్యంత వైభవంగా పెద్ది ప్రీ-రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారని సమాచారం. ఈ మెగా వేడుకకు ముఖ్య అతిథిగా నటసింహం నందమూరి బాలకృష్ణ హాజరు కానున్నట్లు పరిశ్రమ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న హై-వోల్టేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (Peddi). ఈ వేసవిలో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అత్యంత భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్న చిత్రాలలో ఇది ఒకటి. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ సరికొత్త వ్యూహాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే ముంబైలో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జాతీయ స్థాయిలో భారీ సంచలనం సృష్టించగా, ఆ తర్వాత భోపాల్‌లో గ్రాండ్ మ్యూజికల్ కాన్సర్ట్ ప్లాన్ చేశారు.
ఈ క్రమంలోనే, జూన్ 2వ తేదీన హైదరాబాద్‌లోని శిల్పకళా వేదిక లేదా ఎల్బీ స్టేడియంలో అత్యంత వైభవంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారని సమాచారం. ఈ మెగా వేడుకకు ముఖ్య అతిథిగా నటసింహం నందమూరి బాలకృష్ణ హాజరు కానున్నట్లు పరిశ్రమ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఈ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చినప్పటి నుంచి ఫిలిం నగర్ సర్కిల్స్‌లో ఇదే అంశం హాట్ టాపిక్‌గా మారింది.
నందమూరి బాలకృష్ణ ఈ ఈవెంట్‌కు రావడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. ‘పెద్ది’ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ పతాకంపై నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాత వెంకట సతీష్ కిలారు, ప్రస్తుతం బాలయ్య హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘NBK111’ (వర్కింగ్ టైటిల్) చిత్రానికి కూడా ఆయనే నిర్మాత కావడం విశేషం. ఒకే నిర్మాణ సంస్థలో బ్యాక్-టు-బ్యాక్ భారీ బడ్జెట్ సినిమాలు వస్తున్న తరుణంలో, ఆ బ్యానర్ పరిధిలోని అగ్ర హీరోలు ఒకరికొకరు మద్దతుగా నిలవడం టాలీవుడ్లో మంచి సంప్రదాయం. ఈ నేపథ్యంలోనే నిర్మాత వెంకట సతీష్ కిలారు సైతం ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో.. బాలయ్య బాబు ఈ ఈవెంట్‌కు వచ్చే అవకాశం మెండుగా ఉందంటూ ఒక చిన్న హింట్ ఇచ్చారు.
ఇదిలాఉంటే, రామ్ చరణ్ అంటే నందమూరి బాలకృష్ణకు ఎంతో ఇష్టం. ఆహా ఓటీటీ వేదికగా సూపర్ హిట్ అయిన ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ టాక్ షోలో రామ్ చరణ్‌తో బాలకృష్ణ నడిపించిన సంభాషణలు, వారి మధ్య ఉన్న ఆత్మీయ సాన్నిహిత్యాన్ని స్పష్టంగా చూపించాయి. ఆ సమయంలో చరణ్‌ను తాను సొంత బిడ్డలా భావిస్తానని బాలయ్య ఎంతో ఎమోషనల్‌గా చెప్పగా, చరణ్ కూడా బాలకృష్ణను ‘బాబాయ్’ అంటూ ఎంతో గౌరవపూర్వకంగా పిలిచారు. ఈ ప్రత్యేక బంధం కారణంగానే, చరణ్ సినిమాను ఆశీర్వదించడానికి బాలయ్య తప్పకుండా వస్తారని ఇండస్ట్రీ వర్గాలు నమ్ముతున్నాయి.
అయితే చిత్ర యూనిట్ నుండి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఏదేమైనా, జూన్ 2న హైదరాబాద్ వేదికపై బాలకృష్ణ, రామ్ చరణ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే మాత్రం ‘పెద్ది’ సినిమా హైప్ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లడం ఖాయం. మైత్రీ మూవీ మేకర్స్, సుకూమార్ రైటింగ్స్ సమర్పిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













