Last Updated:
ఇది 4 వేల కోట్ల సినిమానా? వారణాసిలోని ఆ ఒక్క సీన్ ముందు రామాయణ ట్రైలర్ మొత్తం దిగదుడుపే అనే టాక్ నడుస్తుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఓ సారి ఆ వివరాలు చూద్దామా..
పాన్ ఇండియా రేంజ్లో అశేష సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘రామాయణ’ మూవీ ట్రైలర్ వచ్చేసింది.నేటితరం ప్రేక్షకులను అలరించేందుకు సరికొత్తగా ఈ రామాయణాన్ని వెండితెరపైకి తీసుకొస్తున్నారు డైరెక్టర్ నితీష్ తివారీ. దాదాపు 4 వేల కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్నారు. సన్నీ డియోల్, రవి దూబే, రకుల్ ప్రీత్ సింగ్ వంటి పలువురు స్టార్స్ కూడా భాగమవుతున్నారు.
భారీ బడ్జెట్, అద్భుతమైన సాంకేతిక నాణ్యత కారణంగా ఈ చిత్రం ఇప్పటికే భారతదేశంలో, విదేశాలలో ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. రెండు భాగాలుగా భారీ స్థాయిలో ఈ ఎపిక్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పార్ట్-1ని ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఈ రోజు (జూలై 30) తెల్లారుజామున బ్రహ్మ ముహూర్తంలో ట్రైలర్ రిలీజ్ చేశారు. 4.09 నిమిషాల నిడివితో కట్ చేసిన ఈ ‘రామాయణ’ ట్రైలర్ విడుదల చేసిన కాసేపట్లోనే వైరల్ అయింది. ప్రస్తుతం ఎక్కడ చేసినా ఈ రామాయణ గురించిన చర్చలే నడుస్తున్నాయి.
ఇంతవరకు బాగానే ఉన్నా.. కొందరు మాత్రం ఈ ‘రామాయణ’ ట్రైలర్ పై తెగ ట్రోల్స్ చేస్తున్నారు. నిజంగా చెప్తున్నా ఇప్పటివరకైతే ఇది రూ.4 వేల కోట్ల సినిమాగా అనిపించలేదు అని ట్విట్టర్ లో ఓ యూజర్ కామెంట్ పెట్టాడు. కొందరు మాత్రం రామాయణ ట్రైలర్ ను వారణాసి టీజర్ గ్లింప్స్ తో పోల్చుతుండటం గమనార్హం. రామాయణ ట్రైలర్ ఓ లేజీ ఏఐ ప్రాజెక్ట్ లాగా కనిపిస్తోంది. వారణాసిలోని ఈ ఒక్క సీన్ రామాయణ సినిమా రెండు భాగాల కంటే బెటర్’’ అని కొందరు కామెంట్స్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. మరోవైపు రావణాసురుడిగా యష్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన బాడీ లాంగ్వేజ్ రామాయణ మూవీలో ఏ ఒక్క క్యారెక్టర్ కూడా సెట్ కాలేదనే టాక్ బలంగా వినిపిస్తోంది.
Honestly, the Ramayana trailer feels like a lazy AI project nothing real about it.
Now, just look at this scene from Varanasi! I can say with full confidence, this single scene outshines both parts of #Ramayana . . #Varanasi pic.twitter.com/i9ln9UvdlK— Shikhar Negi (@ImshikharNegi) July 30, 2026
రామాయణ సినిమాలో.. ‘రామానంద్ సాగర్’ సీరియల్ లో రాముడిగా నటించిన నటుడు అరుణ్ గోవిల్.. ఈ సినిమాలో దశరథుడిగా నటిస్తుండగా.. కౌసల్యగా ఇందిరా కృష్ణన్, కైకేయిగా లారాదత్త, సుమిత్రగా సోనల్ ఝా కనిపించనున్నారు. లక్ష్మణుడిగా రవి దూబే, భరతుడిగా ఆదినాథ్ కొఠారే, హనుమాన్ గా సన్నీడియోల్, శతృఘ్నుడిగా నితీశ్ శర్మ, మందాకినిగా కాజల్ అగర్వాల్, సూర్పనఖగా రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనున్నారు. ట్రైలర్ లో చూపించిన సీతారాముల కళ్యాణం, వనవాసం, రామరావణుడి యుద్ధం సహా ప్రతి ఫ్రేమ్ కూడా మిశ్రమ స్పందన అందుకుంది. సో, చూడాలి మరి రిలీజ్ తర్వాత ఈ సినిమా పరిస్థితి ఎలా ఉంటుందనేది.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana














