Last Updated:
భారతీయ ఇతిహాసం ‘రామాయణం’ ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం ‘రామాయణం’ (Ramayana). రీసెంట్ గా వచ్చిన ఈ సినిమాపై ట్రైలర్ పై తాజాగా సందీప్ రెడ్డి వంగా స్పందించారు.
భారతీయ ఇతిహాసం ‘రామాయణం’ ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం ‘రామాయణం’ (Ramayana). రణ్‌బీర్ కపూర్, రాకింగ్ స్టార్ యశ్, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ పాన్ వరల్డ్ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలై అంచనాలను ఆకాశానికెత్తేసింది. ముఖ్యంగా ‘యానిమల్’ ఫేమ్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ ట్రైలర్‌పై చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.
సాధారణంగా ఏ సినిమాపైనా అంత సులభంగా స్పందించని సందీప్ రెడ్డి వంగా.. రామాయణం ట్రైలర్‌కు ఫిదా అయ్యారు. “ఇది కేవలం ట్రైలర్ కాదు.. ధర్మం ఎప్పుడూ అధర్మంపై గెలుస్తుందనే సనాతన సత్యాన్ని గుర్తుచేసే శంఖారావం.. ఇది రామయుగం ఆరంభం” అంటూ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ప్రశంసల వర్షం కురిపించారు. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ సినిమాలతో ఇండస్ట్రీ హిట్లు కొట్టి, ప్రస్తుతం ప్రభాస్‌తో ‘స్పిరిట్’ (Spirit) తెరకెక్కించే పనుల్లో ఉన్న ఈ మాస్ డైరెక్టర్.. రామాయణం విజువల్స్, ఎమోషన్స్ పట్ల ముగ్ధుడయ్యారు. ఈ సినిమా కేవలం హాలీవుడ్ స్థాయి మేకింగ్‌తో మాత్రమే కాకుండా, భారతీయుల మూలాలను, ఎమోషన్స్‌ను పీక్స్‌లో టచ్ చేసిందని ఆయన కితాబునిచ్చారు.
“YEH RAM YUG KA AARAMBH HAI.”
Not just a trailer, but the eternal reminder that DHARMA will always triumph over ADHARMA.https://t.co/5uAgQKUlqg
— Sandeep Reddy Vanga (@imvangasandeep) July 31, 2026
‘రామాయణం’ ట్రైలర్‌లో నటీనటుల గెటప్స్, వారి స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచాయి. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో అద్భుతమైన ప్రశాంతతను, గంభీరతను ప్రదర్శించారు.
తనదైన సహజ నటనతో సాయి పల్లవి సీతాదేవిగా ఒదిగిపోయిన తీరు అందరినీ కట్టిపడేస్తోంది. కేజీయఫ్ (KGF) సిరీస్‌తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన యశ్.. రావణాసురుడి పాత్రలో మాసివ్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన గంభీరమైన వాయిస్, లుక్స్ ట్రైలర్‌కే అతిపెద్ద హైలైట్‌గా నిలిచాయి.
దంగల్ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన నితీష్ తివారీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రఖ్యాత ప్రొడక్షన్ హౌస్ డీఎన్‌ఈజీ (DNEG) అధినేత నమిత్ మల్హోత్రా సహకారంతో వందల కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా వీఎఫ్ఎక్స్ (VFX) పనులు జరుగుతున్నాయి. దీనికి తోడు ఇద్దరు ఆస్కార్ విజేతలు ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ (Hans Zimmer) సంయుక్తంగా అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతీ ఫ్రేమ్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళ్తోంది.
రెండు భాగాలుగా రాబోతున్న ఈ ఇతిహాస కావ్యంలో మొదటి భాగం ‘రామాయణం: పార్ట్ 1’ ఈ ఏడాది దివాళీ కానుకగా ప్రపంచవ్యాప్తంగా బహుభాషల్లో భారీ ఎత్తున థియేటర్లలోకి రానుంది. సందీప్ రెడ్డి వంగా పోస్ట్‌తో ప్రాజెక్ట్‌పై హైప్ అమాంతం పెరిగిపోయింది.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana














