Shocking Incident: ఊరిలో పాతికేళ్ల యువకుడి సజీవ సమాధి.. 36 గంటల తర్వాత ఏమైందంటే..? | ట్రెండింగ్ | ACTPnews

Haryana Live Burial Stunt


Last Updated:

Shocking Incident: కూటి కోసం కోటి తిప్పలు అన్నారు పెద్దలు. బ్రతకడానికి , కుటుంబాన్ని పోషించుకోవడానికి చేసే విన్యాసాలు, సర్కస్ ఫీట్లు పక్కవాళ్లకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి కాని చేసే వాళ్లకు మాత్రం కత్తి మీద సాములా ఉంటుందని చాలా మందికి తెలియదు. హర్యానాలో జరిగిన ఓ ఘటనే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

Haryana Live Burial Stunt
Haryana Live Burial Stunt

Shocking Incident: కూటి కోసం కోటి తిప్పలు అన్నారు పెద్దలు. బ్రతకడానికి , కుటుంబాన్ని పోషించుకోవడానికి చేసే విన్యాసాలు, సర్కస్ ఫీట్లు పక్కవాళ్లకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి కాని చేసే వాళ్లకు మాత్రం కత్తి మీద సాములా ఉంటుందని చాలా మందికి తెలియదు. హర్యానాలో జరిగిన ఓ ఘటనే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సజీవ సమాధి స్టంట్ చేయాలని ప్రయత్నించిన ఓ వ్యక్తి ప్లాన్ బెడిసి కొట్టడమే కాకుండా అతని అతివిశ్వాసం కారణంగా ఓ నిండు ప్రాణం పోయింది. హర్యానాలోని నూహ్ జిల్లా తౌరు సబ్‌డివిజన్ పరిధిలోని ఖోరీ కలాన్‌ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఊరిలో సజీవ సమాధి..

పూట గడవాలంటే కష్టపడాలి. అయితే కష్టపడలేని కొందరు సర్కస్ ఫీట్లు, స్టంట్స్ చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో జనం ఇచ్చే డబ్బులతో కాళం వెళ్లదీస్తుంటారు. అయితే హర్యానా రాష్ట్రంలో గ్రామానికి వచ్చిన ఓ వ్యక్తి సజీవ సమాధి చేస్తానంటూ చేసిన స్టంట్ విషాదంగా మారింది. నూహ్ జిల్లా తౌరు సబ్‌డివిజన్ పరిధిలోని ఖోరీ కలాన్‌ గ్రామంలో ఊరూరు తిరిగి సర్కస్ చేసుకునే ఓ బృందం బుధవారం నాడు గ్రామస్తులను ఆశ్చర్యపరిచాలని సజీవ సమాధి అంటూ ఓ స్టంట్ ప్రారంభించింది. సంచార సర్కస్ బృందం నిర్వాహకుడు దీపక్ అనే 27 సంవత్సరాల వ్యక్తి ఈ స్టంట్ చేశాడు.

పాతికేళ్ల యువకుడు బలి..

ప్రాణాలతో ఉన్న వ్యక్తిని గోయ్యి తొప్పి అందులో 24గంటల పాటు పూడ్చిపెట్టడాన్ని సజీవ సమాధి అంటారు. గ్రామం మధ్యలో ఓ గొయ్యి తొవ్వి గోనె సంచిలో దీపక్‌ని బంధించిన తర్వాత అతడ్ని ఆ గోతిలో పూడ్చిపెట్టారు. 24 గంటల తర్వాత అతడ్ని సజీవంగా బయటకు తీస్తామని సర్కస్‌ నిర్వాహకులు చెప్పారు. అయితే ముందుగా చెప్పిన సమయానికి అతడ్ని గోతిలోంచి బయటకు తీస్తే సర్కస్ నిర్వాహకులు చెప్పినట్లుగానే ఈ స్టంట్ సక్సెస్ అయ్యేదేమో కాని మరో 12 గంటలు ఆలస్యంగా అంటే 36 గంటల తర్వాత సజీవ సమాధి చేసిన దీపక్ గోనె సంచిని బయటకు తీయడంతో అతను చనిపోయాడు.

ప్రాణం తీసిన సర్కస్ స్టంట్..

సర్కస్ నిర్వాహకుల అతివిశ్వాసం వల్ల 24 గంటల వరకు సజీవ సమాధి చేస్తామని అంతకంటే ఎక్కువసేపు భూమిలో పాతిపెట్టడం వల్ల దీపక్ ఊపిరి ఆడక చనిపోయినట్లుగా తేలింది. ఈ ఘటన స్థానికుల్ని భయాందోళనకు గురి చేసింది. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. డబ్బుల కోసం గ్రామస్తుల్ని నమ్మించడం కోసం ఇలాంటి సర్కస్ ఫీట్స్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు పోలీసులు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports